కృష్ణ

బీజేపీతో టీడీపీకి కుదిరిన సయోధ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, జూలై 18: నాడు వైకా పా 13సార్లు అవిశ్వాస తీర్మానం నోటీ సు ఇస్తే అనుమతించని స్పీకర్ నేడు టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి చర్చకు అనుమతించడం వెనుక కుట్రదాగి ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మె ల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి బీజేపీ వ్యతిరేక పార్టీలు ఎందు కు మద్దతు ప్రకటించాయో స్పష్టం చేయాలన్నారు. నగరంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ ఢిల్లీ కేంద్రంగా టీడీపీకి బీజేపీకి రాజకీయ సయోధ్య కుదిరిందన్నారు. మొన్నటి పార్లమెంట్ సమావేశాల్లో వైకాపా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చిన వారిని లెక్కలోకి తీసుకోని కేంద్రం నాడు నిబంధనల ప్రకారం 50మంది ఉన్నా పట్టించుకోలేదన్నారు. కానీ నేడు మాత్రం టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని మాత్రం పరిగణలోకి తీసుకుందన్నారు. టీడీపీ రాజగురువైన వ్యక్తిని అమిత్‌షా హైదరబాద్‌లో కలిసి రెండు పార్టీలకు సయోధ్య చేశారని చెప్పారు. అవిశ్వాస తీర్మానం తో ఏం ప్రయోజనం ఉంటుందని ఒకప్పుడు చెప్పిన చంద్రబాబు తరువాత ఎన్ని యూటర్న్‌లు తీసుకున్నాడో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. వైకాపా రాజ్యసభ సభ్యులతో పాటు రాజీనామా చేసి ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేయడాన్ని టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. నిజంగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసే వాళ్లు ఈ విధం గా అడ్డుచెబుతారా అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా నినాదం తో అనేక ఆందోళనలు, యువభేరీలు, పోరాటాలు చేసి బతికించింది వైకాపానేనని, ప్రత్యేక హోదాను మొదటి నుండి వ్యతిరేకించిన చంద్రబాబు నేడు యూటర్న్ తీసుకుని తానేదో హోదా కోసం పోరాడుతున్నట్లు డ్రా మాలాడుతున్నారని దీనిని నమ్మేస్థితి లో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. చంద్రబాబును నమ్మితే కుక్కతోక పట్టుకొని గో దావరి ఈదినట్లేనన్నారు. వైకాపా ఎం పీల త్యాగాలపై తప్పుడు ప్రచారాలు చేసి దుర్మార్గంగా వ్యవహరించారని తె లిపారు. మరోసారి మోదీ చంద్రబాబు జోడి రాష్ట్రాన్ని నిలువునా ముంచేందు కు సయోధ్య కుదుర్చుకున్నారని ఆరోపించారు. మహాసంప్రోక్షణ సందర్భం గా ఆగస్టు 11 నుంచి 16 వరకు ఆగమశాస్త్ర నియమాలు, ధర్మాల మేరకు వేం కటేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేయాలని పాలక మండలి తీసుకున్న ని ర్ణయంపై పలువురు అభ్యంతరం వ్య క్తం చేస్తున్నారని తెలిపారు. ఆలయ చ రిత్రలో మహాసంప్రోక్షణ సందర్భంగా ఎప్పుడూ దేవాలయాన్ని మూయలేదని తెలిసిందన్నారు. తర్వాత పాలక మండలి తన నిర్ణయంపై పునఃసమీక్ష చేసిందని గుర్తు చేశారు. కాని చంద్రబాబు దీనిపై స్పందించి దేవాలయ మూసివేత నిర్ణయంపై పునఃసమీక్ష చే శారని, సీఎం ఆదేశించగానే ఆగమశా స్త్ర నియమాలు మార్చేస్తారా అని ప్ర శ్నించారు. ఆలయ అధికారులు సీఎం అదేశాలను పాటిస్తారా లేక ఆగమనియమాలు, ధర్మాలు అనుసరిస్తారా అని ప్రశ్నించారు. టీటీడీపై పలు దఫాలుగా వివాదాలు వస్తున్నా ప్రభు త్వ ఎందుకు స్పందించడం లేదన్నారు. అన్న క్యాంటీన్‌లలో కూడా పెద్ద ఎత్తున దోపీడీ జరుగుతోందన్నారు.

బంద్ ప్రభావం ప్రజలపై పడనివ్వొద్దు
మైలవరం, జూలై 18: ఈ నెల 20 నుండి లారీల బంద్ నిర్వహిస్తున్నందున దీని ప్రభావం ప్రజలపై పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తహశీల్దార్ పి పుల్లయ్య సూచించారు. బుధవారం మైలవరంలోని వివిధ వ్యాపారస్తులు, పెట్రోల్ బంకుల యజమానులు, రేషన్ షాపుల డీలర్లతో ఆయన అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లారీల బంద్ ప్రభావం ప్రజలపై పడుకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు, ఇంధనం, పెట్రోల్, గ్యాస్ వంటి వాటిని డంప్ చేసుకుని సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. వ్యాపారస్తులు నిత్యావసర సరుకులను నిల్వ చేసుకోవాలన్నారు. బంద్‌ను దృష్టిలో ఉంచుకుని ఎవరైనా వ్యాపారులు సరుకులను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొన్నారు.