కృష్ణ

ర్యాగింగ్ నిరోధానికి సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 18: ర్యాగింగ్ భూతాన్ని తరిమి కొట్టేందుకు అన్ని వర్గాలు సహకరించాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ర్యాగింగ్‌తో విద్యార్థులు ఆత్మ విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటైన యాంటీ ర్యాగింగ్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. ర్యాగింగ్‌ను నిర్మూలించే దిశగా యాంటీ ర్యాగింగ్ రివ్యూ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలు విద్యా సంవత్సరంలో కనీసం రెండు సార్లు విద్యా సంస్థలను సందర్శించి ర్యాగింగ్ నిర్మూలనకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జిల్లా కమిటీ చైర్మన్‌గా వ్యవహరించే కమిటీలో వైస్ చైర్మన్‌గా జిల్లా ఎస్పీ, సభ్యులుగా ఆర్డీవోలు, డీఎస్పీలు, విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్ ఉంటారన్నారు. ఈ కమిటీలకు విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వాములుగా చేయడం జరిగిందన్నారు. ప్రతి కాలేజీలో ర్యాగింగ్ ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-5314ను ఏర్పాటు చేశామన్నారు.

సాంకేతికతతోనే దేశాభివృద్ధి
మైలవరం, జూలై 18: సాంకేతిక అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని అమెరికాలోని ఇండియానా ప్రడ్యూ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ విలియం బిల్ వోక్స్ అన్నారు. స్థానిక ఎల్బీఆర్సీఇలో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఇన్ కమ్యూనిటీ సర్వీసెస్ అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ కమ్యూనిటీ సర్వీసెస్ ప్రోగ్రామును ఇంజనీరింగ్ కరిక్యులంలో చేర్చటానికి సంబంధించిన ఒప్పందాన్ని ఈసదస్సులో కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా విలియం బిల్ వోక్స్ మాట్లాడుతూ ఏ దేశమైనా సాంకేతికంగా అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలు, ప్రజలు సాంకేతికంగా అభివృద్ధి చెందాలని అందుకు ఎపిక్స్ ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రిన్సిపాల్ కె అప్పారావు మాట్లాడుతూ ఎపిక్స్ ప్రోగ్రాంను ఇంజనీరింగ్ కరిక్యులంలో రెండు కోర్సులుగా ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. డీన్ అకడమిక్స్ కృష్ణారావు మాట్లాడుతూ మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు పోటీ పడాలని అన్నారు. ప్రెసిడెంట్ జి శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కె శ్రీనివాసరెడ్డి, వివిధ విభాగాధిపతులు, తృతీయ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.

లారీల బంద్‌కు సహకరించండి
మైలవరం, జూలై 18: ఈ నెల 20 నుండి నిర్వహించే లారీల బంద్‌కు అందరూ సహకరించాలని మైలవరం ఏరియా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓర్సు రామారావు కోరారు. లారీల బంద్ విషయాన్ని బుధవారం ఆయన తహశీల్దార్ పుల్లయ్యను కలసి వినతి పత్రాన్ని అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ పిలుపు మేరకు ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రవాణా రంగానికి డీజిల్ ధరలు పెంచి మరింత పెరుభారంగా మార్చారన్నారు. పన్నుల పేరుతో మరింత భారాన్ని మోపటం కారణంగా లారీ యజమానులకు నష్టాలు మిగులుతున్నాయన్నారు. నిర్మించిన రోడ్లకు పెట్టుబడులు వచ్చినా కొన్ని చోట్ల టోల్ ఫీజు పేరుతో దోపిడీ ఎక్కువైందన్నారు. డీజిల్ ధరలను తగ్గించి దేశవ్యాప్తంగా ఏకీకృత ధరలను నిర్ణయించాలని, టోల్ చార్జీల చెల్లింపు విధానాన్ని సరళతరం చేయాలని, థర్డ్‌పార్టీ ఇన్స్యూరెన్స్ విధానాన్ని మార్పు చేయాలని తదితర డిమాండ్లతో బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.