కృష్ణ

రాష్ట్రంలో కేంద్ర పథకాలే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జూలై 18: కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అభివృద్ధి సూన్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి ధ్వజమెత్తారు. మైలవరం నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశం బుధవారం స్థానిక భావనాఋషి కల్యాణ మంటపంలో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తమ సొంత పధకాలుగా ప్రచారం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటై 1500 రోజులు గడిచిన దృష్ట్యా ఎంతో చేశామని పండగలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేయటం సిగ్గు చేటన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా కేంద్రమే నిర్మిస్తుందని కానీ దీనిని తామే నిర్మిస్తున్నట్లు రాష్ట్ర టీడీపీ నేతలు ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. పైగా తామే నిర్మిస్తున్నట్లు టీడీపీ కార్యకర్తలకు ప్రాజెక్టును చూపిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దుకు తానే ప్రధానికి సలహా ఇచ్చానని నిన్నటి వరకూ చెప్పుకున్న చంద్రబాబు నేడు ప్రధాని చేసిన ఈ పనుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమతో విభేదించి తాజాగా కాంగ్రెస్‌తో జతకడుతూ తమపై రెచ్చగొడుతున్నాడని విమర్శించారు. 1999లో వాజపేయి, 2014లో మోదీ చరిష్మాతో అధికారంలోకి వచ్చిన టీడీపీకి కేంద్రంపై ఆరోపణలు చేసే అర్హత లేదన్నారు. ఈ విషయాలను కార్యకర్తలు ప్రజలకు తెలియజేసి గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు రేగళ్ళ రఘునాధరెడ్డి మాట్లాడుతూ గడచిన నాలుగేళ్ళుగా రాష్ట్రం జాతీయ స్థాయిలో అవినీతి రాష్ట్రంగా అగ్రస్థానంలో నిలిపారని ఆరోపించారు. కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల అంజిబాబు మాట్లాడుతూ రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లను కేంద్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు సగ్గుర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరుద్యోగ యువకులకు కేంద్రం ఇన్నోవా కార్లు అందిస్తోందన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు పి వెంకటేశ్వరరావు, అసెంబ్లీ కన్వీనర్ జె శేఖర్, వజ్రాల వెంకట కృష్ణారెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

‘సంజీవని’ ఆదర్శం కావాలి
కూచిపూడి, జూలై 18: నాట్యక్షేత్రం కూచిపూడిలో సిలికానాంధ్ర వసుదైక కుటుంబం సహకారంతో నిర్మిస్తున్న సంజీవని మల్టీ స్పెషాలిటీ వైద్యాలయ నిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక వైద్యశాలను నిర్మించి పేదలకు ఉత్తమ కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావాలని ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పేర్కొన్నారు. సంజీవని వైద్యాలయం నిర్మాణం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా, నాట్యారామ కమిటీ చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ 58వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం వైద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జొన్నవిత్తుల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక వైద్య సదుపాయాలతో పాటు ఉత్తమ వైద్యులతో సేవలందించేందుకు ముందుకు వస్తున్న ఆనంద్ కృషి అభినందనీయమన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డి విజయ భాస్కర్ మాట్లాడుతూ కూచిపూడి పరిసర ప్రాంతాలలోని 500 గ్రామాల ప్రజలకు సేవలందించేందుకు నిర్మిస్తున్న సంజీవని వైద్యాలయం ప్రశంసనీయమన్నారు. 180 గ్రామాలలోని 8లక్షల మంది ప్రజలకు ఆరోగ్య సేవలందించేందుకు నిర్మిస్తున్న సంజీవని మల్టీ వైద్యాలయం రాష్ట్రానికే గర్వకారణమని ఏపీ నాటక అకాడమి చైర్మన్ గుమ్మడి గోపాళరావు ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆనంద్‌ను అతిథులు దుశ్శాలువాలతో సత్కరించగా సిలికానాంధ్ర ఆధ్వర్యంలో ఆనంద్ అతిథులను సత్కరించారు. ఐఎఎస్ అధికారి, ఈ కార్యక్రమంలో రాష్ట్ర రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ సంచాలకుడు పి వెంకట్రామరెడ్డి, వేదాంత పండితుడు విష్ణ్భుట్ల సూర్యనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు.