కృష్ణ

‘పోర్టు’ భూములపై దుష్ప్రచారం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 18: బందరు ఓడరేవు భూములపై దుష్ప్రచారం తగదని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోర్టు నిర్మాణం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, కొంత మంది పోర్టు భూములపై లేని పోని ఆరోపణలు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం స్థానిక 2వ వార్డులో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పోర్టు భూములపై హైకోర్టు స్టే ఇచ్చిదంటూ సోషల్ మీడియాలో కొంత మంది చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్ర స్థాయిలో ఖండించారు. ఇటువంటి ప్రచారం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందే తప్ప ముందుకు సాగదన్నారు. పోర్టు నిర్మాణానికి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నిర్మించి తీరుతామన్నారు. రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి భూములు ఇస్తేనే తీసుకుంటామన్నారు. ఇదే విషయాన్ని తాము అధికారంలోకి వచ్చిన నాటి నుండి చెబుతున్నామన్నారు. అనుబంధ పరిశ్రమల స్థాపన నిమిత్తం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను కూడా త్వరలోనే రద్దు చేయనున్నట్లు తెలిపారు. రైతు ఆశించిన మేర పరిహారం ఇచ్చేందుకు గాను భూమి కొనుగోలు పథకాన్ని తీసుకు వచ్చామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం, ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

ముగిసిన నాట్య గురువుల పునశ్చరణ శిక్షణ
కూచిపూడి, జూలై 18: రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ, కూచిపూడి నాట్యారామం సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న కూచిపూడి నాట్య గురువుల శిక్షణ తరగతులు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా స్థానిక శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠంలో శిక్షణ, పునశ్చరణ తరగతులకు విచ్చేసిన నాట్య గురువులకు నాట్యాచార్య డా. వేదాంతం రామలింగశాస్ర్తీ, డా. వేదాంతం రాధేశ్యాం, డా. చింతా రవి బాలకృష్ణ, డా. ఎలేశ్వరపు శ్రీనివాస్, డివి దుర్గా భవానీ, పసుమర్తి హరనాధశాస్ర్తీ, చింతా సూర్యప్రకాష్ సహకారంతో కూచిపూడి నాట్యంలో తుది శిక్షణ ఇచ్చారు. అంతకు ముందుగా సంజీవని వైద్యాలయంలో అంబాపరాకు, పద్మభూషణ్ డా. వెంపటి చినసత్యం విరచిత బ్రహ్మాంజలి, హనుమత్ వైభవం తదితర అంశాలను రామలింగశాస్ర్తీ నట్టవాంగం, వేదాంతం రాధేశ్యాం, బాలకృష్ణ, దుర్గా భవానీ గాత్ర సహకారంతో 270 మంది నాట్య గురువులు ఒకేసారి తమ నృత్యాలను ప్రదర్శించారు. నాట్య గురువులకు కో-ఆర్డినేటర్ సింగ్, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు విజయ భాస్కర్ నాట్య గురువులకు చెల్లించాల్సిన రూ.కోటి 50లక్షల గౌరవ వేతనాన్ని త్వరలో నాట్యారామం ద్వారా అందచేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వాగ్ధానం చేశారు.