క్రైమ్/లీగల్

రౌడీషీటర్ శంకర్‌కు జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (లీగల్), ఆగస్టు 6: ఇటీవల జిల్లా బహిష్కరణకు గురైన రౌడీషీటర్ మాదివాడ శివ శంకరరావు అలియాస్ శంకర్‌కు హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ 6వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి టి మల్లిఖార్జునరావు సోమవారం తీర్పు చెప్పారు. 2012 నవంబర్ 27వతేదీన మచిలీపట్నం నవకళా సెంటరులో శక్తిగుడి సెంటరుకు చెందిన వడ్డీ వ్యాపారి గంధం వెంకటేశ్వరరావు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మాదివాడ శంకర్‌ను చిలకలపూడి పోలీసులు పేర్కొన్నారు. శంకర్‌తో పాటు హత్యకు కుట్ర పన్నారని ఆరోపణలపై షేక్ అనీఫ్, కేతరాజు శేషగిరి, మాదివాడ హరి శంకర్ అలియాస్ బుజ్జి, అడపా వెంకటేశ్వరరావు అలియాస్ వెంకన్న, కూరేటి వెంకట శివరామ ప్రసాద్ అలియాస్ శివయ్యలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో సాక్ష్యాధారాలను బట్టి ప్రధాన నిందితుడి ఒక్కడినే దోషిగా న్యాయమూర్తి భావించి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. మిగిలిన వారిపై మోపిన నేరం ఋజువు కానందున వారిని నిర్ధోషులుగా విడుదల చేశారు. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న మాదివాడ శంకర్ చట్టాన్ని ఉల్లంఘిస్తుండటంతో ఇటీవల జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆరు నెలల పాటు జిల్లా నుండి బహిష్కరించారు. ప్రాసిక్యూషన్ తరపున 16 మంది సాక్షులను అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోవాడ నిరీక్షణరావు విచారించారు.