కృష్ణ

ఓటుకు కోట్లు కేసుకు రాష్ట్రాన్ని పణంగా పెట్టిన చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, మే 15: ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడటం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆరోపించారు. ఈ కేసులో అరెస్టు కాకుండా తప్పించుకునేందుకే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో లాలూచీ పడ్డారని, అందువల్లే తెలంగాణలో పెద్దఎత్తున ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నా నోరుమెదపటం లేదని విమర్శించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. మన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో పెద్దఎత్తున ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు, రంగారెడ్డి, దిండి, తదితర ఎత్తిపోతల పథకాల వల్ల కృష్ణా, గోదావరి డెల్టాలతో పాటు కోస్తా, రాయలసీమ ప్రాంతాలు పూర్తిగా ఎడారిగా మారనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి నదిపై ఎగువన పొరుగు రాష్ట్రం తలపెట్టిన ప్రాజెక్టులతో వర్షాకాలం తప్ప మిగిలిన కాలాల్లో గోదావరిలో నీరు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. కృష్ణా, గోదావరి అథారిటీని ఏర్పాటు చేసినప్పటికీ కెసిఆర్‌తో లాలూచీ వల్ల తెలంగాణలో కుడుతున్న ప్రాజెక్టులను చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోలేక పోతోందని మండిపడ్డారు. ఈనేపథ్యంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. డెల్టా ఆధునీకరణ పనుల వల్ల కృష్ణా డెల్టాకు 18 టిఎంసిల నీటిని కోల్పోతున్నామని, పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు. కేంద్రం జాప్యం చేయక వెంటనే పలవరం నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తమ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డి 16 నుండి మూడు రోజులు కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు వద్ద దీక్ష చేపడుతున్నారని, దీక్షను జయప్రదం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అందుకు సంఘీభావంగా ఈ నెల 17న నియోజకవర్గ స్థాయిలో ఒకరోజు నిరసన దీక్షలు చేయనున్నట్లు రమేష్ వివరించారు. పార్టీ జిల్లా కార్యదర్శి కె నరసింహారావు, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు ఎన్ రమేష్‌బాబు, రేపల్లె శ్రీనివాసరావు పాల్గొన్నారు.