క్రైమ్/లీగల్

వృద్ధ దంపతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముసునూరు, ఆగస్టు 8: వయోభారం ఒకవైపు... మరోపక్క భార్యకు మానసికస్థితి సరిగా లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి బలవన్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముసునూరుకు చెందిన కొమ్మన రామదాసు (90) ఆయన భార్య అచ్చిమాంబ (80) వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు విశాఖపట్నంలో ఉద్యోగం నిమిత్తం స్థిరపడగా కూతురు వివాహం చేసుకుని భర్తతో జీవిస్తోంది. ఈ క్రమంలో మృతుడు రామదాసు భార్య అచ్చిమాంబకు గత కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేకపోవడంతో వైద్యం చేయిస్తున్నాడని, కుమారుని వద్ద ఉండి వారం క్రితమే ముసునూరు వచ్చినట్లు కుమారుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇంట్లో ఉన్న దొండపాదుకి పురుగులు సోకాయని చెప్పి మంగళవారం రాత్రి రామదాసు పురుగుల మందు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చాడు. మతిస్థిమితం లేని భార్యను సాకలేక విసుగుచెందిన రామదాసు చనిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకుని పురుగుల మందును ముందుగా భార్యకు సగం పోసి మిగిలిన సగం తాను తాగిన కొద్ది సేపటికి ఆ ఇంటి నుండి కేకలు వినిపించడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా ఇద్దరి నోటివెంబడి నురగలు రావడం గమనించిన స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడు కొమ్మన పట్ట్భారామయ్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి శవ పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.