కృష్ణ

ఉన్నత విద్యావకాశాలపై ఎల్బీఆర్సీఇలో సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఆగస్టు 9: అమెరికాలో ఉన్నత విద్యావకాశాలు, కావాల్సిన నైపుణ్యాలు అనే అంశంపై గురువారం ఎల్బీఆర్సీఇ కళాశాలలో సెమినార్ నిర్వహించారు. ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ సెమినార్‌లో యుఎస్‌ఏలో జర్నలిస్ట్‌గా పని చేస్తున్న డాక్టర్ కుమార్ అన్నవరపు పాల్గొని విద్యార్థులకు అనేక విషయాలను వివరించారు. అమెరికా వెళ్ళాలనుకునే విద్యార్థులకు తగు సూచనలు, సలహాలను, జాగ్రత్తలను తెలిపారు. అమెరికాలో ఎన్ని యూనివర్శిటీలున్నాయి, ఎన్ని కొత్త కోర్సులున్నాయి, విద్యార్థులు అక్కడ చదవాలనుకునే వారు సీట్లు ఎలా సాధించాలి, స్కాలర్‌షిప్‌లు ఎలా పొందాలి, స్టూడెంట్స్ అసోసియేషన్స్ కొత్త స్టూడెంట్స్‌కు ఎలా సహకరిస్తాయో తెలియజేశారు. అంతేగా అమెరికాలో ఉన్నత విద్యావకాశాలకు సంబంధించిన సకల సమాచారంతో కూడిన పుస్తకాన్ని అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల వైస్ చైర్మన్ లకిరెడ్డి ప్రసాదరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటి నుండే అమెరికా వెళ్ళేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. ఇందుకు ఈ సెమినార్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కళాశాల ప్రెసిడెంట్ జి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ కె అప్పారావు, వైస్ ప్రిన్సిపాల్ కె శ్రీనివాసరెడ్డి, స్కిల్ డెవలప్‌మెంట్ కోఆర్డినేటర్ కుమార్, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.

పోరాటనగర్‌లో విష జ్వరాలు
మైలవరం, ఆగస్టు 9: మండలంలోని కీర్తిరాయినిగూడెం శివారు పోరాటనగర్‌లో విష జ్వరాలతో అనేక మంది మంచాన పడ్డారు. దీంతో వైద్య ఆరోగ్య సిబ్బంది అక్కడ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి రోగులను పరీక్షిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న మండల తహశీల్దార్ పి పుల్లయ్య గురువారం పోరాటనగర్‌ను సందర్శించారు. విషజ్వరంతో ఇటీవల గ్రామంలో పత్తిపాటి జ్యోతి(48) మృతి చెందటంతో గ్రామంలో అలజడి మొదలైంది. అనేక మంది జ్వరంతో బాధపడుతున్నారు. అంతేగాక వీరికి రక్తంలో ప్లేట్‌లెట్స్ పడిపోవటంతో మరింత ఆందోళన మొదలైంది. అనేక మంది మైలవరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. తహశీల్దార్ పుల్లయ్య పోరాటనగర్‌కు చేరుకుని జ్వర పీడితులను పరామర్శించారు. అనంతరం గ్రామంలో కొనసాగుతున్న వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు, రోగులకు సూచించారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని, తాగునీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయాలని ఆదేశించారు. కాలువలు, డ్రైన్లలో బ్లీచింగ్ చల్లాలని పంచాయితీ సిబ్బందికి సూచించారు. అంతకుముందు తహశీల్దార్ పుల్లయ్య కీర్తిరాయినిగూడెంలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తుల నుండి సమస్యలను అడిగి తెలసుకున్నారు. కార్యక్రమంలో స్పెషలాఫీసర్ ఎన్ అశోక్, ఎంపిడిఓ శ్రీనాధ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

ఐదు ఇసుక ట్రాక్టర్లు సీజ్
తోట్లవల్లూరు, ఆగస్టు 9: మండలంలోని రొయ్యూరు క్వారీకి నుంచి వస్తున్న ట్రాక్టర్లు అధిక లోడుతో పాటు అతివేగంగా వెళ్లటం వల్ల తరుచూ ప్రమాదాలు చోటుచేసుకోవటంతో గురువారం ఉయ్యూరు ఆర్టీఓ నారాయణ స్వామి ఆస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫలితంగా చాలా ట్రాక్టర్లు రొయ్యూరు క్వారీకి రాకుండా ఆగిపోయాయి. తనిఖీలో ఐదు ట్రాక్టర్లను సీజ్ చేశామని నారాయణస్వామి తెలిపారు. ట్రాక్టర్లు నడిపే ప్రతివ్యక్తి తప్పని సరిగా లైసెన్స్, వాహనానికి సంబంధించి అన్ని అనుమతి పత్రాలు ఉండాలని, అతివేగంగా నడపకుండా క్రమశిక్షణతో వాహనం నడపాలని సూచించారు. డ్రైవింగ్ రాని యువకులు ట్రాక్టర్లు తోలటం వల్ల ప్రమాదాలు జరిగి నిండు ప్రాణాలు పోతున్నాయని తెలిపారు. లైసెన్స్ లేని డ్రైవర్లు అడ్డగోలుగా ట్రాక్టర్లను నడుపుతూ ప్రాణాలు తీస్తున్నారని ప్రజలు చెపుతున్నారని పేర్కొన్నారు.