కృష్ణ

ప్రభుత్వాలను గద్దె దించుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 9: కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించేందుకు ప్రతి ఒక్క కార్మికుడూ సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై కేశవరావు పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా డేను పురస్కరించుకుని కార్మిక, కర్షక సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. జైల్ భరో అనంతరం సుమారు 700 మంది కార్మికులు స్వచ్చందంగా అరెస్టు అయ్యారు. వివిధ రంగాలకు చెందిన కార్మికులు, కర్షకులు పట్టణ పుర వీధుల్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఎ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 130 కోట్ల దేశ జనాభాలో 60 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధార పడి ఉన్నారన్నారు. అటువంటి వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తోందన్నారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామన్న కేంద్రం ఆ దిశగా తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా కింద దేశ వ్యాప్తంగా 10 కంపెనీలు రైతుల వద్ద నుండి రూ.27వేల 500 కోట్లు వసూలు చేశాయన్నారు. అయితే బీమా సొమ్ము చెల్లించడంలో కూడా కంపెనీలు పక్షపాత ధోరణి అవలంబిస్తున్నాయని ఆరోపించారు. సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముజఫర్ అహ్మద్ మాట్లాడుతూ స్వదేశీ నినాదంతో గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం హరిబాబు మాట్లాడుతూ నేడు వ్యవసాయ రంగంలో కార్మికుల భాగస్వామ్యం పెరిగిందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ రఘు, శ్రామిక మహిలా జిల్లా కన్వీనర్ పి ధనశ్రీ, సీఐటీయు తూర్పు కృష్ణా అధ్యక్ష, కార్యదర్శులు చౌటపల్లి రవి, వై నరసింహరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టివి లక్ష్మణస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం తూర్పు కృష్ణా అధ్యక్ష, కార్యదర్శులు వై మధు, మురాల రాజేష్, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకుడు కొడాలి శర్మ, సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌సిపి రెడ్డి, కోశాధికారి బూర సుబ్రహ్మణ్యం, మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

జంక్షన్‌లో గంజాయి స్వాధీనం
హనుమాన్ జంక్షన్, ఆగస్టు9: స్థానిక ఆర్‌టీసీ బస్టాండ్ అవరణలో ఓ వ్యాన్‌లో తరలించేందుకు సిద్ధంగా వుంచిన 82 కిలోల గంజాయిని హనుమాన్ జంక్షన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ అవరణలో మారుతి ఏకో వ్యాన్‌ను నిలిపి వుంచారు. వ్యాన్‌ను చాలాసేపు నిలిపివుంచడంతో అనుమానం వచ్చిన ప్రయాణీకులు జంక్షన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో జంక్షన్ సీఐ నాయుడు, ఎస్‌ఐ సతీష్ వ్యాన్ వద్ద చేరుకుని పరిశీలించగా మూడు సంచులలో గంజాయి ప్యాకెట్లు వున్నాయి. వ్యాన్ గురించి బస్టాండ్‌లో వాకబు చేసిన ఎవరూ సమాచారం ఇవ్వకపోవడంతో స్టేషన్‌కు తరలించారు. సంచులను విప్పి గంజాయి ప్యాకెట్లను లెక్కించిన పోలీసులు 82 కిలోలుగా (26 ప్యాకెట్లు) వున్నాయని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్నారని, వ్యాన్ తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో వుందని సీఐ వెల్లడించారు.