కృష్ణ

మత్స్య పరిశ్రమతో ఆర్థిక ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, మే 15: నిత్యం విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చి పెడుతున్న మత్స్య పరిశ్రమతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని శాసనసభ ఉప సభాపతి, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం స్థానిక కృష్ణా తీరాన యువ ఆక్వా రైతు తలశిల రఘుశేఖర్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఆధునిక చేపల పెంపకం (కెజి సిస్టమ్)ను పరిశీలించిన అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఆక్వా రంగంలో ఆటుపోట్లను ఎదుర్కొంటున్న మత్స్యకారులు కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఇలాంటి విధానంలో చేపల పెంపకాన్ని చేపట్టటం ద్వారా లబ్ధిపొందటమే కాకుం డా ప్రభుత్వ ఆర్థిక ప్రగతికి సైతం దోహదపడవచ్చని మండలి సూచించారు. ఆదాయ వనరుల్లో మత్స్య పరిశ్రమకు మించినది మరోటి లేదన్నారు. ఈ పరిశ్రమ ద్వారా ఇతర రైతులు ప్రయోజనం పొందాలని ఆయన కోరారు. మత్స్యశాఖ డెప్యూటీ డైరెక్టర్ సాల్మన్ రాజు మాట్లాడుతూ కృష్ణా జిల్లా నుంచి మత్స్య పరిశ్రమ ద్వారా సాలీనా రూ.5వేల కోట్ల ఆదాయం సమకూరుతోందని వెల్లడించారు. భావదేవరపల్లి ఫిషరీస్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ వీరభద్రరావు, బందరు ఆర్డీవో పి సాయిబాబు, తహశీల్దార్ నరసింహారావు, బందరు జెడ్పీటిసి లం కే నారాయణప్రసాద్, డీన్ డిటి రమణ, శాస్తవ్రేత్త ఇమల్డా, ఎఎంసి ఛైర్మన్ మం డవ బాలవర్ధనరావు, ఆక్వా రైతులు పాల్గొన్నారు. తొలుత పడవపై నదిలోకి వెళ్లిన మండలి చేపల పెంపక విధానాన్ని పరిశీలించారు. అనంతరం సభాస్థలిలో ఏర్పాటు చేసిన వివిధ రకాల చేపల ప్రదర్శనను తిలకించారు.