కృష్ణ

ఆదివాసీల అభ్యున్నతే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 9: సమాజంలో అట్టడుగున ఉన్న ఆదివాసీలను ఉన్నతులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గిరిజనుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గడిచిన నాలుగేళ్లల్లో 3వేల 600కోట్లు పైగా గిరిజనుల సంక్షేమానికి ఖర్చు చేసినట్లు తెలిపారు. వారి అభ్యున్నతి కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.2200కోట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అంతేకాకుండా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 90 శాతం సబ్సిడీతో పెద్ద ఎత్తున ఆర్థిక తోడ్పాటు ఇస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద మరో రూ.10వేల కోట్లతో వౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. గిరిజన లబ్ధిదారులకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం మాట్లాడుతూ యేడాదిలోగా జిల్లాలోని ప్రతి ఆదివాసీకి పక్కా గృహం నిర్మించి ఇస్తామన్నారు. జిల్లాలో 1.50 లక్షల మంది ఆదివాసీలు ఉన్నారన్నారు. రానున్న జన్మభూమి నాటికి నూరు శాతం రేషన్ కార్డులు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన సంక్షేమ హాస్టళ్లల్లో దాతల సహకారంతో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. తొలుత జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు రూ.50 లక్షల విలువ చేసే ఫ్లాట్ ఫామ్ రిక్షాలు, ఆటో రిక్షాలు, డైరీ యూనిట్లు, కంప్యూటర్లు, జిరాక్స్ మిషన్‌ల పంపిణీ నిమిత్తం మెగా చెక్కును మంత్రి రవీంద్ర, కలెక్టర్ లక్ష్మీకాంతం చేతుల మీదుగా అందచేశారు. అలాగే 8వేల 812 మంది గిరిజన విద్యార్థులకు రూ.14.52కోట్లు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ఉచిత విద్యుత్ పథకం కింద 10వేల 946 మంది గిరిజన లబ్ధిదారులకు రూ.1.40కోట్లు చెక్కులను వారు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బిఆర్ అంబేద్కర్, మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మరకాని పరబ్రహ్మం, బీసీ సంక్షేమాధికారి ఆర్ యుగంధర్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఈశ్వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

చీటర్లు ఆగర్భ శ్రీమంతులా?
వైసీపీ నేత కృష్ణ ప్రసాద్‌పై విరుచుకుపడ్డ మంత్రి ఉమ
జి కొండూరు, ఆగస్టు 9: ఆగర్భ శ్రీమంతులమని చెప్పుకుంటున్న వైసీపీ నేత కేపీ చీటింగ్ కేసులలో ముద్దాయిగా ఎందుకున్నాడో చెప్పాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. మండలంలోని తెల్లదేవరపాడు గ్రామదర్శిని కార్యక్రమంలో గురువారం పాల్గొన్న మంత్రి ఉమ ఇటు కెపిపై, అటు జగన్‌పై తనశైలిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టిన నేత నేడు తనను గ్రామాలలో విమర్శిస్తున్నాడని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలోనే వీరికి ప్రజలు గుర్తుకు వస్తారని ఆరోపించారు. వీరు చెప్పే నీతులు మన పిల్లలకు ఆదర్శం కారాదన్నారు. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టే ఎవరికైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విపక్ష నేత వైఎస్ జగన్‌కు ముఖ్యమంత్రి కావాలనే పిచ్చిపట్టిందని, అందుకే తాను ముఖ్యమంత్రి అవుతున్నట్లు పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. ఎలాగూ సీఎం పీఠం దక్కదని తేలిపోవడంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో జగన్‌కు తెలియడం స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో అమలు సాధ్యం కాని హామీలు గుప్పిస్తూ ‘వాకింగ్’ చేస్తున్నాడని విమర్శించారు. మండలంలో 90 ఎకరాల సాగుకు సంబంధించి ఎన్‌ఎస్‌పి నుండి ఊరచెరువుకు ఎత్తిపోతల పధకానికి 24 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోనే పింఛన్లు ఐదు రెట్లు పెంచి నెలనెలా అందిస్తున్నట్లు తెలిపారు. మైలవరం నియోజకవర్గంలో 208 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 72.66 లక్షల రూపాయలు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ నియోజకవర్గంలో 2,130 మందికి 13.28 కోట్ల రూపాయలు అందించినట్లు వివరించారు. అనంతరం గంగినేనిపాలెంలో మాజీ సర్పంచ్ మంగలంపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ అభినందన సభలో మంత్రి ఉమ పాల్గొని పాలకవర్గాన్ని శాలువాలతో సత్కరించారు.