కృష్ణ

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), ఆగస్టు 15: 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో బుధవారం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో పాటు దేశభక్తిని చాటే విధంగా పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మామ కూతురా అంటూ జవహర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు జానపద నృత్యాన్ని, బాలాజీ విద్యాలయం విద్యార్థులు బ్యాండ్ విన్యాసాలు, అర్తమూరు జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థుల కోలాటం ఆహుతులను విశేషంగా ఆకర్షించింది. సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులను మంత్రులు పరిటాల సునీత, కొల్లు రవీంద్ర, ఎంపి కొనకళ్ల నారాయణరావు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, కలెక్టర్ లక్ష్మీకాంతం, జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు అభినందించారు.

ఉత్తమ సేవలకు ‘ప్రశంస’
మచిలీపట్నం, ఆగస్టు 15: జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, కార్యాలయాల సిబ్బంది బుధవారం పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత, రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం చేతుల మీదుగా 350 మందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. జాయింట్ కలెక్టర్-2 పిడుగు బాబూరావు, జిల్లా రెవెన్యూ అధికారి బిఆర్ అంబేద్కర్, సోషల్ వెల్ఫేర్ జెడీ పిఎస్‌ఎ ప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ ఇడీ సత్యనారాయణ, బీసీ వెల్ఫేర్ డీడీ యుగంధర్, డెప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మీరాప్రసాద్, వ్యవసాయ శాఖ జెడీ మోహనరావు, డీఎస్‌ఓ జి నాగేశ్వరరావు, ఎస్‌ఎస్‌ఎ పీఓ కెడివిఎం ప్రసాదబాబు, డివిజనల్ ఫారెస్ట్ టెరిటోరియల్ అధికారి బెనర్జి, ఎపీ టిఐడీసీఓ పీడీ చిన్నోడుతో పాటు వివిధ శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు ప్రశంసా పత్రాలు అందచేశారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
మచిలీపట్నం (కల్చరల్), ఆగస్టు 15: 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో బుధవారం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో పాటు దేశభక్తిని చాటే విధంగా పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మామ కూతురా అంటూ జవహర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు జానపద నృత్యాన్ని, బాలాజీ విద్యాలయం విద్యార్థులు బ్యాండ్ విన్యాసాలు, అర్తమూరు జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థుల కోలాటం ఆహుతులను విశేషంగా ఆకర్షించింది. సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులను మంత్రులు పరిటాల సునీత, కొల్లు రవీంద్ర, ఎంపి కొనకళ్ల నారాయణరావు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, కలెక్టర్ లక్ష్మీకాంతం, జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు అభినందించారు.

పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఆగస్టు 15: శాంతి భద్రతల పరిరక్షణలో విశేష కృషి చేసిన పలువురు పోలీసు అధికారులు, సిబ్బందికి బుధవారం జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ సేవా పతకాలు, సేవా పతకాలు అందుకున్నారు. రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, కొల్లు రవీంద్ర, కలెక్టర్ బి లక్ష్మీకాంతం, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చేతుల మీదుగా సేవా పతకాలను అందుకున్నారు. జిల్లా సాయుధ విభాగంలో హెచ్‌సీలుగా సేవలు అందిస్తున్న ఎస్‌ఎ సమ్మద్, కె సాంబశివరావు ఉత్తమ సేవా పతకాలు అందుకున్నారు. ఎఆర్ ఎస్‌ఐ టి పోతయ్య, ఇనగుదురు ఎఎస్‌ఐ ఎస్‌ఆర్ మోహనరావు, గుడివాడ సీసీఎస్ ఎఎస్‌ఐ కె సాంబ శివరావు, ఎఆర్ హెచ్‌సీ ఎన్ బాబూరావు, పామర్రు హెచ్‌సీ కె చంద్రరావు, చాట్రాయి ఎఎస్‌ఐ ఎం రాంబాబు, డీసీఆర్‌బీ హెచ్‌సి జి కోటేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ సెల్ పీసీ టివి గోపాలరావు, పదవీ విరమణ చేసిన ఆర్‌హెచ్‌సీ యండీ అస్మతుల్లా, విశ్రాంత ఎస్‌ఐలు ఎస్ వీర్రాజు, డి అప్పారావు, కె భాస్కరరావు సేవా పతకాలను అందుకున్నారు.