కృష్ణ

సంక్షేమంలో ‘కృష్ణా’ ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 15: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కృష్ణా జిల్లా దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. బుధవారం మచిలీపట్నంలోని జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుద దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్భ్రావృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి ప్రశంసిస్తూ గడిచిన నాలుగేళ్లల్లో జిల్లాలో సాధించిన ప్రగతిని ఆమె వివరించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తారతమ్య భేదాలు లేకుండా కృషి చేస్తోందన్నారు. ఇందుకు కృష్ణాజిల్లా బాసటగా నిలుస్తోందన్నారు. గడిచిన నాలుగేళ్లల్లో జిల్లా అద్వితీయమైన అభివృద్ధిని సాధించినట్లు తెలిపారు. ప్రధానంగా వ్యవసాయం, ఆక్వా, విద్య, ఆరోగ్యంలో గణనీయమైన అభివృద్ధిని సాధించినట్లు వివరించారు. జిల్లా తలసరి ఆదాయం కోటి కోటి 90వేల కోట్లతో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఐక్యరాజ్య సమితి స్థిరమైన అభివృద్ధి సూచికల్లో నిర్వహించిన సర్వేలో రాష్ట్రానికి 44వ ర్యాంక్ రాగా జిల్లాకు ప్రథమ ర్యాంక్ రావడం హర్షణీయమన్నారు. దేశంలోనే తొలిసారిగా ఐఎస్‌ఓ సర్టిపికేట్ సాధించిన కలెక్టరేట్‌గా కృష్ణాజిల్లా కలెక్టరేట్ చరిత్రకెక్కిందన్నారు. కృష్ణా-గోదావరి నదుల అనుసందానంతో నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఇప్పటి వరకు 26 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాడెల్టాకు అందించినట్లు తెలిపారు. రూ.1571కోట్ల మేర స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాలు అందించి జిల్లా వరుసగా మూడు సార్లు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు వివరించారు. చంద్రన్న పెళ్లి కానుక ద్వారా జిల్లాలో 448 జంటలకు రూ.2.24కోట్లు అందించామన్నారు. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో వౌలిక సదుపాయాలు కల్పించి 5 స్టార్ రేటింగ్ సాధించినట్లు తెలిపారు. డిజిటల్ విద్య బోధన కోసం 173 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌లు ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. ఏపీ టిడ్కో ద్వారా విజయవాడ నగరపాలక సంస్థ, జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాల్లో 60వేల గృహాలు మంజూరు చేసినట్లు తెలిపారు. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దామన్నారు. కార్యక్రమంలో న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, కలెక్టర్ లక్ష్మీకాంతం, ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావుతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.