కృష్ణ

31న తెలుగు భాష, సాంస్కృతిక సమ్మేళనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, మే 15: విజయవాడ సాహితీ సంస్థలు, ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో తెలుగు భాష, సాంస్కృతిక సమ్మేళనం ఈ నెల 31న ఉదయం 10గంటల నుండి విజయవాడ శేషసాయి కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పి సుబ్బారావు, జివి పూర్ణచంద్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి, పరిరక్షణే ధ్యేయంగా సాంస్కృతిక పునరుజ్జీవనం ఉద్యమంలో భాగస్వాములు కావటం కోసం ఈ సమ్మేళనానికి రావాల్సిందిగా వారు భాషా ప్రియులను కోరారు. రాష్ట్రం నలుమూలల నుండి, రాష్ట్రేతర ప్రాంతాల నుండి భాషావేత్తలు, సాహితీవేత్తలు, సాంస్కృతిక రంగ ప్రముఖులు సమ్మేళనానికి వస్తారని, ఉదయం 9, 10 గంటల మధ్య సభాస్థలిలో ప్రతినిధుల వివరాలు నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఎలాంటి రుసుము లేదని, ప్రతినిధులకు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ షష్టిపూర్తి మహోత్సవాన్ని తెలుగు భాషా సాంస్కృతిక సమ్మేళనంగా జరపాలని నిర్ణయించామని, ఇందుకు ఎన్టీఆర్ ట్రస్టు కూడా సహకరిస్తోందని వారు తెలిపారు. సమ్మేళనానికి రాలేనివారు తమ అమూల్యమైన సలహాలు, సూచనలు రాతపూర్వకంగా పంపాలని కోరారు. ఇతర వివరాలకు డా. జివి పూర్ణచంద్ 9440172642ను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్టు అధ్యక్షులు నారా లోకేష్ కూడా పాల్గొంటారని ప్రకటనలో వివరించారు.