కృష్ణ

మంచినీటి కోసం ఎదురుచూపులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, మే 15: అధికారుల నిర్లక్ష్యానికి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మంచినీళ్ల కోసం నానాతంటాలు పడుతున్నారు. వేలాది రూపాయలు జీతాలు పొందుతూ, చేసిన పనులకు పర్సంటేజీలు తు.చ.తప్పకుండా తీసుకుంటూ నిరుపేదలకు అవసరమైన మంచినీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించటం ఎంత దారుణమో అధికారులు ఆలోచించుకోవాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తీసుకునే జీతాలకు సరిపడా కాకపోయినా కనీసం కొంత భాగమైనా విధి నిర్వహణపై బాధ్యత చూపించేవారే కరవయ్యారని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. మండలంలో ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ నిర్లక్ష్య వైఖరే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. ఈ శాఖకు సంబంధించి ప్రజలకు నీటి అవసరాలను తీర్చే బోర్లు ఏర్పాటు, వాటి పరిరక్షణ బాధ్యత కాగా మండలంలో మంచినీటి సమస్య లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. అలాగే నీటి వసతులకు సంబంధించి బోర్లపై వారి పర్యవేక్షణ శూన్యం. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచినా మండలంలోని ప్రజలకు నీటి వసతుల కల్పనలో ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ప్రజలు ముక్తకంఠంతో విమర్శిస్తున్నారు. మండు వేసవిలో కూడా ఆ శాఖ అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదు. మండలంలోని పలు గ్రామాల్లో 365 రోజుల పాటు సక్రమంగా పనిచేసిన బోరు ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. చాగంటిపాడులో లక్షలాది రూపాయలతో డబ్బ పంపులు ఏర్పాటు చేయగా కనీసం ఒక్కటి కూడా పనిచేయటం లేదంటే వాటిని ఎలాంటి వారికి కాంట్రాక్ట్ ఇచ్చి నిర్మించారో అర్థవౌతుంది. రొయ్యూరు, బొడ్డపాడు, చినపులిపాక గ్రామాల్లో విద్యుత్ కోతల వల్ల బోర్ల ద్వారా నీటి సరఫరా సరిగా జరగటం లేదని, కనీసం గ్రామాల్లో డబ్బా పంపులైనా వేసి ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని, చెడిపోయిన పంపులను వెంటనే బాగుచేయాలని ఎంపిటిసి సభ్యుడు మూడే శివశంకర్ అధికారులను కోరారు. మనఊరు, ప్రజావాణి, గ్రామసభ లాంటి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాల్లో నాయకులు, అధికారులు ఊకదంపుడు ఉపన్యాసాలిప్పి మమా.. అనిపిస్తున్నారే తప్ప, ప్రజలకు ఒరగబెట్టింది ఏమిలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా అధికారులు అలసత్వం వీడి మండువేసవిలోనైనా మంచినీటి సమస్య పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.