కృష్ణ

వైభవంగా శ్రీ వైకుంఠనాథస్వామి కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, మే 15: పండితుల వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల వాసుదేవ నామస్మరణల మధ్య శ్రీ, భూ, నీలా సమేత వైకుంఠనాథ స్వామివారి కల్యాణం ఆదివారం వైభవంగా జరిగింది. ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ ముత్తీవి సీతారాం గురుదేవులు - కమల దంపతులు, కోసూరు మురళీకృష్ణమాచార్యులు బ్రహ్మత్వంలో, ఆత్మకూరి లక్ష్మణదాసు పౌరోహిత్యంలో శ్రీ సీతారాం గురుదేవ దంపతులు శ్రీ, భూ, నీలా సమేత శ్రీరంగనాథులు, శ్రీ, భూ, నీలా సమేత శ్రీ వైకుంఠనాథస్వామి, శ్రీదేవి, భూదే వి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల కల్యాణాలను కన్నులపండువగా, శా స్త్రోక్తంగా నిర్వహించారు. ఈసందర్భం గా ఉదయం ఆశ్రమంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు జరిగాయి. విష్ణుసహస్ర నామం, శ్రీసూ క్తం, పురుష సూక్తం, నిత్యానుష్టానం, హనుమత్ విభూదిలను భక్తిశ్రద్ధలతో పఠించారు. ఆశ్రమ సన్నిధి కార్యదర్శి తుర్లపాటి రాధాకృష్ణ పర్యవేక్షణలో యతీంద్ర సేవా సమితి సభ్యులు భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేసి అన్నసమారాధన నిర్వహించారు. ము త్తీవి గౌరాకృష్ణ కల్యాణ హోమాలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులు ఆలపించిన భజన పరవశింపజేసింది. ఈసందర్భంగా నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం, చతురోక్తులు కార్యక్రమం భక్తులను పరవశింపజేశాయి. తీర్థప్రసాద వినియోగం జరిగింది.