కృష్ణ

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బిజెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, మే 15: రాష్ట్రంలో బిజెపి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, కార్యకర్తలు ఇందుకు మరింతగా కృషిచేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి అన్నారు. ఆదివారం స్థానిక బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో అందరినీ సమన్వయపర్చి గ్రామస్థాయి నుండి బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్భ్రావృద్ధికి బిజెపి సహకరిస్తోందని, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు. రానున్న స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండా పోటీ చేసేందుకు బిజెపి సిద్ధంగా ఉందన్నారు. ముందుగా బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. పట్టణంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి, నాయకులు గుత్తికొండ శ్రీరాజబాబు, వలపర్ల వెంకటేశ్వరరావు, సూరే గాంధీ, తదితరులు పాల్గొన్నారు.