కృష్ణ

ప్రజాదివస్ సమస్యల పరిష్కార చర్యలపై నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రజాదివస్‌లో వచ్చే సమస్యల పరిష్కార చర్యలపై నివేదిక సమర్పించాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వారి సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ త్రిపాఠి పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజాదివస్‌లో వచ్చే ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపాలన్నారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిజా నిజాలు తెలుసుకుని పరిష్కరించాలన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమ సమస్యలను ప్రజాదివస్ దృష్టికి తీసుకు వస్తున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అర్జీదారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బందరు, అవనిగడ్డ డీఎస్పీలు మహబూబ్ బాషా, పోతురాజు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఆకుల రఘు తదితరులు పాల్గొన్నారు.