కృష్ణ

వృద్ధులకు ఆసరాగా నిలిచిన ‘హెల్పింగ్ స్పాట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్): వృద్ధులకు ఆసరగా హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ నిలవటం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. పట్టణంలోని వివిధ వృద్దాశ్రమాల్లో ఉంటున్న వృద్ధులందరినీ ఒకే చోట చేర్చి వారి సమస్యలపై స్పందించిన తీరు వృద్ధుల పట్ల వారికున్న ప్రేమాభిమానాన్ని తెలియచేస్తోందన్నారు. సోమవారం హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్థానిక టౌన్ హాలులో వృద్ధుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న వక్తలు హెల్పింగ్ స్పాట్ సేవలను కొనియాడారు. ఇప్పటి వరకు మచిలీపట్నంకే పరిమితమైన హెల్పింగ్ స్పాట్ సేవలు ఇకపై విజయవాడ కేంద్రంగా కూడా అందించనున్నట్లు ఆర్గనైజర్ వెంట్రప్రగడ భార్గవ్ తెలిపారు. విజయవాడ డీఎస్పీ శ్రీనివాస్ సతీమణి కేజియా నేతృత్వంలో విజయవాడలో తమ సంస్థ సేవా కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా సేవా కార్యక్రమాల నిర్వహణలో ముందుంటున్న ఆ సంస్థకు ఆర్థిక తోడ్పాటు అందించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు రూ.25వేలు, ప్రముఖ వైద్యుడు డా. బి ధన్వంతరి ఆచార్య రూ.20వేలు, విజయవాడ డీఎస్పీ శ్రీనివాస్ దంపతులు రూ.10వేలు, 1వ వార్డు కౌన్సిలర్ బత్తిన దాస్ రూ.10వేలు ఆర్థిక సాయన్ని సంస్థకు అందచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

జీవో నెం. 279ను రద్దు చేసే వరకు పోరాడతాం
* మున్సిపల్ కార్మికుల ధర్నాలో సీఐటీయు నేత చౌటపల్లి రవి
మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 17: మున్సిపల్ కార్మికుల ఉద్యోగ భద్రతకు విఘాతం కల్పించే జీవో నెం. 279ని రద్దు చేసే వరకు పోరాడతామని సీఐటీయు తూర్పు కృష్ణా అధ్యక్షుడు చౌటపల్లి రవి స్పష్టం చేశారు. జీవో నెం. 279 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయు, ఎఐటీయుసీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం పురపాలక సంఘ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. వందలాది మంది కార్మికులు ఈ ధర్నాలో పాల్గొని జీవో నెం.279 వల్ల కలిగే ఇబ్బందులను వివరించారు. కార్మికుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. పురపాలక సంఘ కార్యాలయానికి ఎదురుగా బైఠాయించిన కార్మికులను ఆర్‌పేట సీఐ వాసవి, ఎస్‌ఐ హబీబ్ బాషాలు తమ సిబ్బందితో కలిసి అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీ కత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు, ఎఐటీయుసీ నాయకులు బూర సుబ్రహ్మణ్యం, కరపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.