కృష్ణ

త్వరలో బీసీ రాజకీయ పార్టీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: మైలవరంలో త్వరలో బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యలో నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ మారేష్ వెల్లడించారు. సోమవారం మైలవరంలో సంఘ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో త్వరలోనే పార్టీని ప్రకటించనున్నట్లు తెలిపారు. పార్టీ ఆవిర్భావానికి సంబంధించి చర్చలు, సూచనలు అన్ని విషయాలు కీలక దశకు చేరుకున్నాయని బిసి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా కొత్త పార్టీ ఏర్పాటు ఉంటుందన్నారు. వచ్చేనెలలో పార్టీకి సంబంధించి స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బిసిలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నాయని, రాజ్యాధికారంలో జనాభా ప్రాతిపదికన తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నారు. రాబోయే ఎన్నికలలో బిసి అభ్యర్థిని బరిలో నిలపనున్నట్లు తెలిపారు. త్వరలో బిసి ఆత్మగౌరవ యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసమావేశంలో అన్ని మండలాల నుండి బిసి కులాలకు సంబంధించిన నేతలు పాల్గొన్నారు.
పాడైపోతున్న రహదారులను పరిశీలించిన గుడివాక
మోపిదేవి, సెప్టెంబర్ 17: మండల పరిధిలోని మోపిదేవి నుండి అయోద్య వెళ్లే ఆర్‌సీ పాత కరకట్ట చిరువోలు వద్ద మరమ్మతులు చేసిన కొద్ది రోజులకే పూర్తిగా పాడైపోతోంది. రాష్ట్ర వైకాపా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి గుడివాక శివరావు సోమవారం పాడైపోపోతున్న రహదారిని పరిశీలించారు. అనంతరం రహదారిపై వస్తున్న వాహనాలను నిలుపుదల చేసి ఈ విషయమై కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం భారీ వాహనాల రాకపోకలతో రహదారి పాడైపోతోందని, ఈ విషయమై రెండు రోజుల్లో చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా వైకాపా తరపున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తనకు అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు కేటాయించాలని, ఈ విషయమై కొద్ది రోజుల్లో వైకాపా అధినేత జగన్మోహనరెడ్డిని కలవనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోసూరు రామాంజనేయులు, గరికపాటి రాధాకృష్ణ, చిరువోలు ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.