కృష్ణ

అక్రమంగా గనుల తవ్వకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో భూగర్భ గనులకు సంబంధించి బినామీదారులు అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారని, దీనిపై స్వయంగా తాను ఫిర్యాదు చేశానని తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్ చెప్పారు. అక్రమార్కులకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రెండుసార్లు భారీ జరిమానాలు విధించారని, భూగర్భ గనుల మంత్రిత్వ శాఖ, ఇతర శాఖల అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని విమర్శించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో వైకాపా సభ్యులు పలువురు గిరిజన ప్రాంతాల్లో క్వారీ లీజులపై రాతపూర్వకంగా అడిగిన ప్రశ్న చర్చకు రాగా శ్రావణ్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. కొందరు బడాబాబులు లేబర్ కోఆపరేటివ్ సొసైటీలను సృష్టించి లీజులు పొంది నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేస్తున్నారని, తొలిసారి విజిలెన్స్ అధికారులు దాడులు చేసి జరిమానాలు విధించారని ఆయన చెప్పారు. రెండోసారి మూడు రెట్లు జరిమానాలు విధించారని, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద జరిమానాలను వసూలు చేయకపోవటం, లీజులు రద్దు చేయకపోవటం వెనుక ఆంతర్యం ఏమిటని మంత్రిని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వందల కోట్లలో ఆదాయానికి గండి పడుతున్నప్పటికీ ఎందుకు పట్టించుకోవటం లేదని ఆయన నిలదీయటంతో భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు నివ్వెరపోయారు. వెంటనే తేరుకుని అక్కడి లీజులను రెన్యువల్ చేయటం లేదని, జరిమానా వసూలు చేస్తామని హామీ ఇచ్చారు. మరో సభ్యుడు రామకృష్ణ మాట్లాడుతూ సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాల వల్ల రోడ్లన్నీ పాడైపోయాయని, పంచాయతీలకు రావాల్సిన సెస్ బకాయిలు త్వరగా విడుదల చేయాలని మంత్రిని కోరారు.

సీపీఎస్ రద్దు చేయకుంటే ఉద్యమం
తోట్లవల్లూరు, సెప్టెంబర్ 18: ఉద్యోగుల హక్కులను కాలరాస్తు తీసుకు వచ్చిన కొత్త పెన్షన్ విధానం సిపిఎస్ రద్దు చేయాల్సిందేనని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, బొడ్డు నాగేశ్వరరావు పేర్కొన్నారు. సిపిఎస్ రద్దు కోరుతు మంగళవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళుతున్న నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యంలతో పాటు 47 మంది ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులను విజయవాడ లెనిన్ సెంటర్‌లో అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ నేతలు పోలీస్‌స్టేషన్ మెట్లపై బైఠాయించారు. తమను అక్రమంగా అరెస్ట్ చేయటం శోచనీయమని మండిపడ్డారు. హక్కుల సాధన కోసం పోరాటం చేయకుండా ప్రభుత్వం అడ్డుకోవటాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. వీరిని మండల సీపీఎం కార్యదర్శి సీహెచ్ సుబ్బారావు, మండల యుటిఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు బాబ్‌జాని తదితరులు పరామర్శించి సంఘీభావం తెలిపారు.

ఆదర్శ గ్రామంగా కంకటావ
మచిలీపట్నం, సెప్టెంబర్ 18: తాను దత్తత తీసుకున్న గూడూరు మండలం కంకటావ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కంకటావ గ్రామాభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో ఆయన మంగళవారం సమీక్షించారు. రూ.97లక్షలతో రక్షిత మంచినీటి పథకం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి స్వచ్ఛమైన మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం, 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా నిర్మించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అవసరమైన 50 సెంట్ల భూమిని సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధిపై ప్రతి మూడు నెలలకు సమీక్షిస్తానని ఎంపీ తెలిపారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి బూరగడ్డ రమేష్ నాయుడు, గూడూరు ఎంపీపీ కాసగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.