కృష్ణ

ప్రతి పోలీస్ స్టేషన్‌నూ ఆధునీకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 19: నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో తొలి మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి అడుగు పడింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ను మోడల్‌గా నిర్మించాలని ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నడుం బిగించారు. దీంతో కృష్ణలంక నూతన మోడల్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులకు బుధవారం భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.2.75కోట్ల వ్యయంతో ప్రత్యేక అధునాతన వౌలిక సదుపాయాలు, సాంకేతిక ఏర్పాట్లు, వినూత్న హంగులతో ప్రశాంతమైన, స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేలా పోలీస్ స్టేషన్ నిర్మాణం జరగనుంది. ఈ నేపథ్యంలో శంకుస్థాపన సందర్భంగా ఏంపీ కేశినేని నాని మాట్లాడుతూ మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి రూ.2కోట్ల 75లక్షలు ఖర్చు చేయడంతోపాటు సాంకేతిక పరిఙ్ఞనంతో మోడరన్‌గా తీర్చి దిద్దుతామన్నారు. తన చిన్ననాటి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, నగరంలోని ప్రతి పోలీస్ స్టేషన్ ఆధునీకరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కే నాగుల్‌మీరా, నగర పోలీసు కమిషనర్ సీహెచ్‌ద్వారకా తిరుమలరావు, ఏపీ పోలీసు హౌసింగ్ ఎండీ పీవీ సునీల్‌కుమార్, జాయింట్ పోలీసు కమిషనర్ కాంతి రాణా తాతా, క్రైం డీసీపీ బీ రాజకుమారి, డీసీపీలు డాక్టర్ గజరావు భూపాల్, షేక్ నవాబ్‌జాన్, ఏసీపీ జీవీ రమణమూర్తి, సిటీ స్పెషల్ బ్రాంచి ఏసీపీ ఎస్ రమేష్‌బాబు, కృష్ణలంక సీఐ పీ చంద్రశేఖర్, పోలీసు అధికారులు, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.

డయల్ యువర్ కలెక్టర్‌తో
ప్రజలకు మెరుగైన సేవలు
ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 19: ప్రజలకు మెరుగైన సేవలు వేగవంతంగా అప్పటికప్పుడే అందించేందుకు వీలుగా డయల్ యువర్ కలెక్టర్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు. బుధవారం ఉదయం నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి కలెక్టర్ ప్రజలతో డయల్ యువర్ కలెక్టర్ నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లావ్యాప్తంగా 19 రకాలైన కాల్స్‌ను కలెక్టర్ విని తక్షణమే అప్పటికప్పుడు సంబంధిత అధికార్లతో పరిష్కరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతినెల గంటపాటు ప్రజలకు చేరువయ్యేందుకు ఈకార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు వాట్సప్, ఎస్‌ఎంఎస్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రోగ్రామ్, టెలిగ్రామ్, వంటి సమాచార వ్యవస్థ ద్వారా ప్రజల నుండి అందుతున్న సమస్యలను అప్పటికప్పుడే కలెక్టర్ నిర్వహించి ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచినట్లు వివరించారు. ఈకార్యక్రమం ద్వారా 19 సమస్యలను వెంటనే పరిష్కరించారు.