కృష్ణ

పంచాయతీ కామన్ స్థలంలో 20 ఏళ్లుగా ప్రైవేట్ పాఠశాల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, సెప్టెంబర్ 19: పంచాయతీ కామన్ స్థలంలో ఎలాంటి అనుమతులు, అద్దె చెల్లించాల్సిన అవసరం లేకుండా 20ఏళ్లుగా మార్కండేయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలను కోర్టు ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్ బుధవారం పరిశీలించారు. పోరంకి పరిధిలోని టెలీఫోన్ కాలనీ లో పంచాయతీకి కేటాయించిన స్థలం లో కాలనీ వాసులకు ఉపయోగపడే పార్క్, గార్డెన్ ఏర్పాటు చేయాల్సి ఉం ది. అయితే ఆ స్థలంలో 20 ఏళ్లుగా ఎ లాంటి అద్దె చెల్లించకుండా ప్రైవేట్ స్కూ ల్‌ను మార్కండేయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు శ్రీనివాసరావు పాఠశాల ను నిర్వహిస్తున్నారు. ఈ స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడేలా వినియోగించాలని కోరుతూ స్థానికులు కొందరు కో ర్టును ఆశ్రయించారు. ఈ 53 సెంట్ల స్థ లంలో ఉన్న పాఠశాలను పరిశీలించి, ఆ స్థలంలో ప్రజా ప్రయోజనార్థం ఏ మి ఏర్పాటు చేయాలో తెలియచేయాలని కలెక్టర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చే సింది. అందులో భాగంగా జాయింట్ కలెక్టర్ పాఠశాలను పరిశీలించారు. స్థా నికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల నిర్వాహకులు ఈ స్థలం అద్దెకు తీసుకుంటామని, లే దంటే కొనడానికైనా తాము సిద్దమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీ వో చంద్రశేఖర్, డీపీవో విక్టర్, న వర త్నం, తహశీల్దారు మురళీకృష్ణ, ఎంపీడీవో జగపతి విమాదేవి పాల్గొన్నారు.