కృష్ణ

దళిత విద్యార్థులు వివేకవంతులుగా మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కల్చరల్), సెప్టెంబర్ 20: దళిత విద్యార్థులు కష్టపడి చదివి విజ్ఞాన, వివేకవంతులుగా మారాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు లక్ష్య సాధన కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు. గురువారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ ఆ రోజుల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీలు ఊరికి దూరంగా ఉండేవని, విద్యావకాశాలు లేక అంటరానితనంతో మగ్గుతున్న ఎస్సీ, ఎస్టీలకు సమాజంలో సముచిత స్థానం కల్పించిన మహోన్నతుడు డా. బిఆర్ అంబేద్కర్ అన్నారు. దేశంలో మహిళలకు ఓటు హక్కు కల్పించిన మహనీయుడని, స్ర్తి వియోచకుడని, మహిళలకు సర్వ హక్కులు సమానత్వం కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న శివాజీ వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తొలుత లక్ష్మీటాకీసు సెంటరులోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులతో అంబేద్కర్ సెంటరు వరకు ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు వంపుగడల చౌదరి, డీఎస్‌డబ్ల్యుఓ ప్రసాదరావు, పలువురు ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

పాముల్లంక హైలెవల్ బ్రిడ్జి శంకుస్థాపనకు ఏర్పాట్లు
తోట్లవల్లూరు, సెప్టెంబర్ 20: తోట్లవల్లూరు, పాముల్లంక మధ్య కృష్ణానదిపాయపై రూ.30 కోట్లతో నిర్మించే హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు చర్యలు వేగవంతం చేశారు. గురువారం పంచాయతీ ప్రాజెక్టు ఏఈ వెంకటేశ్వరరావు, కాంట్రాక్టర్ వల్లభనేని వెంకటేశ్వరరావు సిబ్బంది బ్రిడ్జి నిర్మాణానికి పాయింట్లను గుర్తించేందుకు సర్వే చేశారు. ఐదేళ్ళ క్రితం వేసిన పాయింట్లను మాజీ సర్పంచ్ పాముల శ్రీనివాసరావు చూపించారు. శనివారానికి పాయింట్ల గుర్తింపు పూర్తి చేస్తామని ఏఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆ తరువాత శంకుస్థాపన ఉంటుందని మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు చెప్పారు.

పోలీసు కుటుంబాలను ఆదుకుంటాం
మచిలీపట్నం (కోనేరుసెంటరు) సెప్టెంబర్ 20: ఆపదలో ఉన్న పోలీసు కుటుంబాలను జిల్లా పోలీసు శాఖ అన్ని వేళలా అదుకుంటుందని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. గుడివాడ-2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వి వెంకటేశ్వరరావు కుటుంబానికి పోలీసు భద్రత పథకం కింద మంజూరైన రూ.4లక్షల చెక్కును ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎఎస్పీ సాయికృష్ణ చేతుల మీదుగా మృతుని కుటుంబ సభ్యులకు గురువారం అందచేశారు. అలాగే జిల్లా పోలీసు కార్యాలయంలో స్పీపర్‌గా పని చేస్తున్న కె శ్రీనివాసరావు ఇటీవల మృతి చెందగా ఆ కుటుంబానికి కూడా రూ.4లక్షలు చెక్కును వారు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ మూర్తి తదితరులు పాల్గొన్నారు.