కృష్ణ

అట్రాసిటీ కేసులు నీరుగారిస్తే ఊరుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 20: అట్రాసిటీ కేసులను నీరుగార్చే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ హెచ్చరించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కార చర్యలపై వివిధ శాఖల అధికారులతో ఆయన గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ వేగవంతంగా కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన అట్రాసిటీ కేసులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కేసుల నమోదు, ఛార్జ్‌షీట్ పైల్ చేశారా లేదా..? విచారణలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కేసుల్లో పరిహారం చెల్లించారు..? తదితర అంశాలపై సంపూర్ణమైన నివేదికను వారం రోజుల్లో ఇవ్వాలన్నారు. హత్య కేసులకు సంబంధించి అర్హులైన బాధితులకు నిబంధనల మేరకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్నారు. కేసు నమోదు అయిన వెంటనే ఎఫ్‌ఐఆర్ ప్రతులు సంబంధిత అధికారులతో పాటు కలెక్టరేట్‌లోని సంబంధిత సెక్షన్‌కు పంపే విధంగా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారిణి లావణ్యవేణి, డీఎస్‌డబ్ల్యుఓ ప్రసాదరావు, మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు వంపుగడల చౌదరి, తహశీల్దార్ కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పోర్టు పేరుతో ఇబ్బంది సరికాదు
* ప్రభుత్వం దృష్టికి రైతుల ఇబ్బందులు * సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
మచిలీపట్నం, సెప్టెంబర్ 20: పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని సీబీఐ మాజీ డైరెక్టర్ జెడీ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం ఆయన పోర్టు ప్రతిపాదిత గ్రామాలైన సిరివేళ్లపాలెం, గోపువానిపాలెం గ్రామాల్లో ఆయన పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడిచిన మూడేళ్లుగా భూముల క్రయ, విక్రయాలపై ఆంక్షలు విధించటంతో కుటుంబ అవసరాలకు అమ్ముకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు రైతులు జెడీ లక్ష్మీనారాయణకు వివరించారు. అవసరం మేర భూములను పోర్టు కోసం తీసుకుంటున్నారన్నారు. వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ పట్టా భూముల్లో పోర్టు కట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని జెడీ లక్ష్మీ నారాయణకు రైతు నాయకుడు వాలిశెట్టి వెంకటేశ్వరరావు వివరించారు. గత ప్రభుత్వంలోనూ, ప్రస్తుత ప్రభుత్వంలోనూ ప్రైవేట్ భూములను ప్రతిపాదించి పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. రైతుల సమస్యలు తెలుసుకున్న జెడీ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ రైతులు వ్యక్తపర్చిన ప్రతి అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళతానన్నారు. రైతుల మనోభీష్టం మేరకు ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. పోర్టు, పరిశ్రమల ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది ఇంజనీర్లు తయారవుతున్నారని, వారందరికీ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకుడు లంకిశెట్టి బాలాజీ, బీజేపీ నాయకులు ఆలపాటి లక్ష్మీనారాయణ, కూనపరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.