కృష్ణ

* ముగిసిన అంతర్జాతీయ ఓజోన్ వారోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, సెప్టెంబర్ 22: స్థానిక ఎల్బీఆర్సీఇలో అంతర్జాతీయ ఓజోన్ వారోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ప్రకృతి ఎన్విరాన్‌మెంట్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు ఓజోన్ పొరపై పోస్టర్ ప్రెజెంటేషన్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ కె అప్పారావు మాట్లాడుతూ ప్రకృతి సంరక్షణలో ప్రతి ఒక్క విద్యార్థి భాగస్వామి కావాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల నుండి మనని మనం కాపాడుకోవటానికి మన వంతు బాధ్యతను మనం నిర్వహించాలన్నారు. క్లబ్ మెంటార్స్ షాహిదా నిలోఫర్, వి భాగ్యలక్ష్మి విద్యార్థులతో కలిసి న్యూస్ పేపర్స్‌తో చేసిన పేపర్ బ్యాగ్స్ వాడకాన్ని ప్రోత్సహించే విధంగా కళాశాల క్యాంటీన్‌లో పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు పోస్టర్ ప్రెజెంటేషన్‌పై పోటీలను నిర్వహించి వారిలో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులు అందించారు.

జ్వరపీడితులను రక్షించాలి
సింహాద్రి రమేష్‌బాబు
అవనిగడ్డ, సెప్టెంబర్ 22: స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో విష జ్వరాలు, డెంగ్యూ జ్వర పీడితులకు పేట్‌లెట్ మిషన్‌ను ఏర్పాటు చేసి జ్వర పీడితులను రక్షించాలని వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు డిమాండ్ చేశారు. స్థానిక ఏరియా వైద్యశాలలోని డెంగ్యూ, పాము కాటు బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేని వారు బయట ప్రాంతాలకు వెళ్లడం భారం అవుతుందన్నారు. ఇక్కడే డెంగ్యూ జ్వరాలకు సంబంధించిన చికిత్సలు నిర్వహించాలన్నారు. అలాగే వ్యవసాయశాఖ పాములు చంపటానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా అవనిగడ్డలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉందని, మురుగునీరు ప్రవహించే మార్గం లేక రహదారులు దుర్గంధం వెదజల్లుతున్నాయన్నారు. ఆయన వెంట పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె నరసింహారావు, వైద్యాధికారిణి డా. కృష్ణదొర ఉన్నారు. ఈ నెలలోనే 104 జ్వరాల కేసులు, పాముకాటు కేసులు 19 వచ్చినట్లు కృష్ణదొర తెలిపారు.

రాష్ట్రంలో దగాకోరు పాలన: కైలే
పామర్రు, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో దగాకోరు పరిపాలన సాగుతోందని, సామాన్యుడు బతకలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని పామర్రు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి కైలే అనిల్‌కుమార్ పేర్కొన్నారు. పామర్రు మండలం వెలకుర్రు, కొలిమెర్ల తదితర గ్రామాలలో గడపగడపకూ వైసీపీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. అనంతరం కైలే విలేఖర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అస్థవ్యస్థ పరిపాలన సాగుతోందని, టీడీపీ పరిపాలనను తుదముట్టడించడానికి ప్రజలు సంసిద్ధమై ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైసీపీ పటిష్ఠంగా ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పచ్చ చొక్కాల వారికే చెందుతున్నాయని ఆరోపించారు. భవిష్యత్తులో రాజకీయ అధికారం వైసీపీ కైవసం చేసుకుని జగన్ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమని కైలే అనిల్‌కుమార్ జోస్యం చెప్పారు. బూత్ కమిటీల శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు పార్టీ మండల అధ్యక్షుడు కాకర్ల వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు బొమ్మారెడ్డి మధుసూధనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.