కృష్ణ

రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 22: జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది. గత మూడు దశాబ్దాలుగా ఏకగ్రీవమవుతున్న రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్నికలు ఈ విడత కూడా ఏకగ్రీవం కావడం విశేషం. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా కొనసాగిన బందరు ఆర్డీవో కార్యాలయ పరిపాలనాధికారి సిహెచ్‌వి చంద్రశేఖర్‌నే మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు శనివారం నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కోర్టు సెంటరులోని రెవెన్యూ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. మొత్తం 21 పోస్టులతో కూడిన ఈ కార్యవర్గానికి ఒకొక్క నామినేషన్ మాత్రమే దాఖలు చేశారు. అధ్యక్షుడిగా చంద్రశేఖర్, సహాయ అధ్యక్షుడిగా ఎ.కొండూరు తహశీల్దార్ జి డేవిడ్ రాజు, ఉపాధ్యక్షులుగా నందివాడ తహశీల్దార్ బి సాయి శ్రీనివాస్ నాయక్, ముడ కార్యాలయంలో పని చేస్తున్న తహశీల్దార్ బి నెల్సన్ పాల్ బాబు, డీఎస్‌ఓ కార్యాలయంలో డెప్యూటీ తహశీల్దార్‌గా పని చేస్తున్న కెజె విక్టర్ పాల్, గుడివాడ తహశీల్దార్ ఆర్ పాపమ్మలు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా విజయవాడ యుఎల్‌సి డెప్యూటీ తహశీల్దార్ డి శ్రీనివాస్, వ్యవస్థీకృత కార్యదర్శిగా ఎన్ శ్రీనివాస మూర్తి, క్రీడ మరియు సాంస్కృతిక కార్యదర్శిగా యు ఆనంద్, సంయుక్త కార్యదర్శులుగా ఎస్‌వి రవీంద్రనాధ్, కెఎస్ జోజి, బి అనురాధ, ఎం ప్రకాశరావు, కోశాధికారిగా పి వైకుంఠరావు, కార్య నిర్వాహక సభ్యులుగా జి భద్రు, సిహెచ్ గోపాలరావు, ఎల్‌విఎన్‌ఆర్‌బి శశికుమార్, ఎన్ నాగరాజు, కె శ్రీనివాస్, ఎన్ వెంకటేశ్వరరావు, ఎన్ అనుష్ కుమార్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు త్రినాధరావు వ్యవహరించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను రెవెన్యూ వర్గాలు ఘనంగా సత్కరించాయి.

అభివృద్ధికి శ్రీకారం చుట్టండి
కూచిపూడి, సెప్టెంబర్ 22: స్వచ్ఛ, ఆకర్షణీయ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు దత్తత తీసుకున్న ఔత్సాహికులు అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన చేపట్టి ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించాలని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని గ్రామాలు ఆకర్షణీయంగా స్వచ్ఛ గ్రామాలుగా అభివృద్ధి పర్చి ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతు ఇచ్చి గ్రామాలను అభివృద్ధి పర్చుకోవాలని ఆమె ఓటర్లకు సూచించారు. నాట్యక్షేత్రం కూచిపూడిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణంపై ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే కల్పన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీపీ కిలారపు మంగమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్పన మాట్లాడుతూ పైప్‌లైన్ ద్వారా భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి గ్రామస్థులు సహకరించాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ విటిఆర్ గోపాల్ గ్రామస్థులకు సూచించారు. కాగా ఇప్పటికే డ్రైనేజీ నిర్మాణానికి విజయవాడ సిద్దార్ధ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రూపొందించిన నివేదికలో స్వల్ప మార్పులు చేసి వచ్చే వారంలో తిరిగి సర్వే చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించాలి
పంచాయతీ సర్పంచ్‌ల పదవీ కాలం ముగియటంతో ప్రభుత్వం నియమించిన గ్రామ ప్రత్యేక అధికారులు నేటికీ కొంత మంది అధికారులు బాధ్యతలు చేపట్టకపోవడంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం కొరవడుతోందని, దీంతో జ్వరాలు విజృంభిస్తున్నాయని ఎమ్మెల్యే కల్పన ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో హిందూ స్మశానవాటిక నిర్మాణానికి 50 సెంట్లు, డంపింగ్ యార్డు నిర్మాణానికి 50 సెంట్ల స్థలాన్ని కేటాయించాలని సిలికానాంధ్ర వ్యవస్థాపక చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ రెవెన్యూ అధికారులను కోరారు. గ్రామంలోని గరిక వెంకటేశ్వరరావుకు రూ.18వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే కల్పన అందచేశారు. అలాగే ఇంటింటికి కుళాయి పథకానికి నియోజకవర్గానికి ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ రూ.102 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కల్పన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆనందరావు, ఎంపీటీసీ కావూరి భానుమూర్తి, డీఇ పి లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.