కృష్ణ

జాబ్ మేళాలతో నిరుద్యోగ సమస్యకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహిస్తోందని జడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ చెప్పారు. గుడివాడ రూరల్ మండలం చౌటపల్లిలో రూ.20లక్షలతో నిర్మించే పాఠశాల కాంపౌండ్ వాల్, రూ.28లక్షలతో చేపట్టిన శివాలయం పునరుద్ధరణ పనులకు ఆమె శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు టెక్నాలజీలో కూడా రాణించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి పాఠశాలలో డిజిటల్ క్లాస్‌రూంలను ప్రారంభిస్తోందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటిస్తూ ప్రతిరోజూ గుడ్డు, పాలు ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రుణమాఫీ చేసిందన్నారు. తూర్పు కృష్ణాడెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుత్తా చంటి మాట్లాడుతూ చంద్రబాబు ముందుచూపు వల్లే పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు సాగునీరు అందిందన్నారు. గుడివాడ ఆర్డీవో జీవీ సత్యవాణి మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఆయా గ్రామాల ప్రజలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అట్లూరి వెంకటేశ్వరరావు, ఇన్‌ఛార్జి డీఎస్‌పీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యావిధానంలో మార్పులు
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విజ్ఞప్తి
నూజివీడు, సెప్టెంబర్ 22: ప్రస్తుత విద్యావిధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ సూచించారు. ఆగిరిపల్లి మండలం తోటపల్లిలోని హీల్ ప్యారడైజ్‌ను శనివారం ఆయన సందర్శించి, అనాథ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న నదుల అనుసంధానం అమలు విద్యార్థుల నుండి వచ్చిన ఆలోచనేనని అన్నారు. మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో ఒక విద్యార్థి నుండి వచ్చిన ఆలోచనే నేటి నదుల అనుసంధానం అమలుకు ‚ప్రారంభించడానికి కారణమన్నారు. విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి అనేక కొత్త ఆలోచనలు చేస్తూ భావి భారత శాస్తవ్రేత్తలుగా భారతదేశానికి పేరుతెచ్చే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాల గురించి ఆయన వివరిస్తూ ఏకాగ్రతతో ఉండాలని, ఆసక్తి కలిగి ప్రతి విషయాన్ని లోతుగా తెలుసుకోవాలని, నిజాయితీగా మంచి పనులు చేస్తూ, మంచి వైఖరి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. హీల్ ప్యారడైజ్ అనాథ విద్యార్థినీ విద్యార్థినులకు అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. ఇంగ్లాండ్‌లో ఉంటూ ఇక్కడ సేవలు అందించటం గర్వకారణమని చెప్పారు. ప్రభుత్వం కూడా ఇటువంటి పాఠశాలలను ప్రోత్సహిస్తూ విద్యావిధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనంతరం హీల్ ప్యారడైజ్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కృత్రిమ అవయవ తయారీ కేంద్రాన్ని సందర్శించి, పలువురికి కృత్రిమ కాళ్ళను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ పి ధనప్రకాష్, సిఇఒ కే అజయ్‌కుమార్, ప్రతినిధులు అనగాని రామ్‌ప్రసాద్, ఎంవీ రంగప్రసాద్, డి భవానీ, వైవిఎస్ చలపతిరావు, ప్రిన్సిపాల్ శోభావాణి తదితరులు పాల్గొన్నారు.