కృష్ణ

వ్యవసాయాన్ని రాజకీయం చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, సెప్టెంబర్ 23: వ్యవసాయ రంగాన్ని రాజకీయం చేసుకుని రైతులు అన్యాయం అవుతున్నారని, ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక అప్పులపాలవుతున్నారని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన మైలవరం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన రెడ్డిగూడెం మండలం రెడ్డిగూడెంలో మామిడి రైతులతో ముఖాముఖి, తిరువూరు నియోజకవర్గం ఎ కొండూరు మండలం దీప్లానగర్ తండాలో కిడ్నీ బాధితులతో, మైలవరం మండలం చండ్రగూడెంలో మల్లె రైతులతో, జి కొండూరు మండలం జి కొండూరులో టమాటా రైతులతో, ఇబ్రహీంపట్నం మండలం ఇబ్రహీంపట్నంలో విటిపిఎస్ కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మైలవరం మండలం చండ్రగూడెంలోని మల్లె రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. మల్లె పంట సాగు ప్రారంభమైన నాటి నుండి దిగుబడి, అమ్మకం, లాభనష్టాల విషయాలను రైతుల నుండి సేకరించారు. ఈ సందర్భంగా రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు లభించటం లేదని, ముఖ్యంగా మార్కెట్ సదుపాయం లేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, పండించిన పంటకు ఒక్కొక్క సమయంలో గిట్టుబాటు ధర లభించటం లేదని వాపోయారు. అందుకు ఆయన స్పందిస్తూ రైతులంతా సంఘటితమై మార్కెటింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొందరు దళారులు తోడై వారే ధరలను నిర్ణయిస్తూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారన్నారు. ఈ దశలో రైతులంతా రాజకీయాలకు అతీతంగా సంఘటితమవ్వాలని పిలుపునిచ్చారు. రాజకీయాలు, కులాలు, మతాలు, వర్గాలు వ్యవసాయ రంగాన్ని బాగుచేయలేవని హితవు పలికారు. రైతులు ముందు వ్యవసాయం, సాగు, దిగుబడి, గిట్టుబాటు ధరపై దృష్టి సారించాలన్నారు. మనం పండించిన పంట దళారులు తక్కువ ధరకు మన వద్దే కొనుగోలు చేసి తిరిగి మనకే అధిక ధరకు విక్రయిస్తున్నారని గుర్తు చేశారు. ఇందుకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తాను రైతుల సమస్యలపైనే అధ్యయనం చేస్తూ పర్యటిస్తున్నానని రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. రైతు సంఘం ప్రతినిధి యర్రబోలు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైతు నేతలు దేవరకొండ ఆంజనేయులు, సంజీవరెడ్డి, శీలం ప్రతాప్‌రెడ్డి, నాని తదితరులు పాల్గొన్నారు.

మట్టి గణపతి నిమజ్జనం
* రూ.34వేలు పలికిన స్వామి వారి లడ్డూ
మచిలీపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 23: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య రహిత సమాజాన్ని కాంక్షిస్తూ జిల్లా కేంద్రం మచిలీపట్నం రాజుపేటలో ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన 25 అడుగుల మట్టి వినాయకుడి నిమజ్జనోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం ప్రతిష్ఠించిన స్థానంలోనే మట్టి వినాయకుడిని నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జనోత్సవానికి మంత్రి కొల్లు రవీంద్ర, ముడ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మచిలీపట్నం అగ్నిమాపక కేంద్రం నుండి ప్రత్యేకంగా తెప్పించిన మూడు ఫైరింజన్ల సాయంతో స్వామివారిని నిమజ్జనం చేశారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించగా వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని వేలం పాట నిర్వహించగా దాసు సాంబశివ శేషగిరిరావు రూ.34వేలకు దక్కించుకున్నాడు.

ప్రజల మేనిఫెస్టోతోనే గ్రామస్వరాజ్యం
జి.కొండూరు, సెప్టెంబర్ 23: సమస్యల పరిష్కరానికి ప్రజలే మేనిఫెస్టో రూపొందించుకోవాలని అప్పుడే గ్రామస్వరాజ్య స్థాపన సాధ్యమని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జి.కొండూరులో వివేకానంద ఇంగ్లీషు మీడియం హైస్కూల్లో ఆదివారం విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ ఎవరికి వారు బాధ్యతగా ఉన్నప్పుడే సమ సమాజ స్థాపన సాధ్యమన్నారు. ఎన్నికల్లో రాజకీయ నాయకులు కోట్లు ఖర్చుపెడితే దానికి మరింత సంపాదించడానికే అధిక ప్రాధాన్యతనిస్తారన్నారు. రైతుల భూముల్లో పైపులైన్లు, విద్యుత్ లైన్ల గురించి రైతులు నష్టపోతున్న వైనాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా, దీనిపై అధ్యయనం చేసి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ముందుగా విద్యార్థులతోమమేకమై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. లక్ష్మీనారాయణను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో కెడిసిసిబి వైస్ చైర్మన్ వేములకొండ రాంబాబు, ఎస్‌ఎస్‌కె విద్యాసంస్థల చైర్మన్, అప్సా అధ్యక్షులు గొల్లపూడి నళినీమోహన్ తదితరులు పాల్గొన్నారు.