కృష్ణ

రాష్ట్ర స్థాయి పోటీలకు పెడసనగల్లు విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, సెప్టెంబర్ 24: మొవ్వ మండలం పెడసనగల్లు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు నలుగురు వెయిట్ లిఫ్టింగ్, కత్తి సాములలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఇన్‌చార్జి హెచ్‌ఎం పి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో తమ పాఠశాలకు చెందిన టి యశ్వంత్ వెయిట్ లిఫ్టింగ్‌లో, బి భరద్వాజ్, కంభం అంజనావతి, రాజులపాటి ధనదీపిక అండర్-17 విభాగాల్లో రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారన్నారు. ఈ నెల 28వ తేదీన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. క్రీడాకారులను, పీఇటీ నాగశివలను పెడసనగల్లు ఎంపీటీసీ, మొవ్వ వైస్ ఎంపీపీ నన్నపనేని వీరేంద్ర, హెచ్‌ఎం ఇంగువ నాగగౌరీ, మాజీ సర్పంచ్ నన్నపనేని స్వర్ణలత అభినందించారు.