కృష్ణ

మీకోసం’ అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 24: వారం వారం ‘మీకోసం’ ద్వారా అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి బి లావణ్యవేణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘మీకోసం’ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఆర్‌ఓ లావణ్య వేణితోపాటు ముడ వైస్ చైర్మన్ పి విల్సన్ బాబు, ఆర్డీవో జె ఉదయ భాస్కర్‌లు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ లావణ్యవేణి మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించరాదన్నారు. ప్రాధాన్యతా క్రమంలో అర్జీలను పరిష్కరించాలన్నారు. పెండింగ్ అర్జీలను సైతం సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖలో పెండింగ్ అర్జీలు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. సంబంధిత శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అవనిగడ్డలో వైసీపీ కార్యకర్తల బైక్ ర్యాలీ
అవనిగడ్డ, సెప్టెంబర్ 24: వైఎస్ జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 3వేల కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా అవనిగడ్డలో వైకాపా నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుండి వందలాదిగా కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి వంతెన సెంటరులో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడి నుండి మోదుమూడి, అశ్వరరావుపాలెం, బందలాయిచెరువు గ్రామాలు మీదుగా అవనిగడ్డ వరకు బైక్ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె నరసింహారావు, రేపల్లె శ్రీనివాసరావు, బీసాబత్తిన విజయలక్ష్మి, చింతలపూడి బాలు, సింహాద్రి వెంకటేశ్వరరావులతో పాటు ఆరు మండలాలకు చెందిన మండల పార్టీ అధ్యక్షుడు, కన్వీనర్లు పాల్గొన్నారు.
మోపిదేవిలో రాష్ట్ర స్థాయి అకడమిక్ మీట్
మోపిదేవి, సెప్టెంబర్ 24: మండల కేంద్రం మోపిదేవి ఎంజెపీ గురుకుల పాఠశాలలో రాష్ట్ర స్థాయి అకడమిక్ మీట్‌ను జెడ్పీటీసీ మెడబలిమి మల్లిఖార్జునరావు చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర మహాత్మ జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలల కార్యదర్శి కృష్ణమోహన్ మాట్లాడుతూ విద్యార్థులు నైతిక విలువలతో విద్యను అభ్యసించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షీయల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ఎంజెపీ డీసీ వెల్ఫేర్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో వేర్వేరుగా బెలూన్‌లను జెడ్పీటీసీ మల్లిఖార్జునరావు చేతులు మీదుగా గాలిలోకి వదిలి మీట్‌ను ప్రారంభించారు. ఈ మీట్‌లో వక్తృత్వం, వ్యాసరచన తదితర ఎనిమిది రకాల పోటీలు నిర్వహించనున్నట్లు ఎజిఓ జయరాజు తెలిపారు. వక్తృత్వ పోటీలను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్‌ఐఇ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి నాగభూషణశర్మ, ఎజిఓ ఎ శ్రీనివాస్, నాగలక్ష్మి, మధుసూధన్, సుధాకర్, కె ఖాదర్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జె ప్రభాకర్, తహశీల్దార్ జె విమల కుమారి, ఎంఇఓ కె రాజ్‌కుమార్, ఏపీఐఆర్ సొసైటీ విద్యార్థులు 200 మంది పాల్గొన్నారు.