కృష్ణ

మాటల ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయ్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 16: మాయ మాటలతో మభ్య పెడుతున్న ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. జీవో నెం 279ని రద్దు చేయాలని గడిచిన 13 రోజులుగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం కార్మికులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. మచిలీపట్నం, పెడన పురపాలక సంఘాల నుండి వందలాది మంది కార్మికులు తరలి వచ్చి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వీరి ఆందోళనకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, జనసేన పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు కార్మికుల పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ విధానాలను తూర్పారబట్టారు. ధర్నా చేస్తున్న కార్మికులంతా ఒక్కసారిగా కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కలెక్టరేట్‌లోకి చొచ్చుకు పోయే ప్రయత్నం చేసిన కార్మికులను పోలీసులు కట్టడి చేశారు. ఇనగదు రు, బందరు తాలుకా సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు అబ్దుల్ నబీ, బిబి రవి కుమార్ తమ సిబ్బందితో కార్మికులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్మికుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం, పెనుగులాటలు చోటు చేసుకున్నాయి. సంఘీభావం తెలిపిన వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్ర తినిధి, ప్రభుత్వ మాజీ విప్ పేర్ని వెంకట్రామ య్య (నాని)తో సహా ఆఖిలపక్షం, సీఐటీయు, ఎఐటీయుసీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నాయకులను తరలిస్తున్న పోలీసు వాహనాలను కార్మికులు అడుగడుగునా అడ్డుకున్నారు. వాహనాలను కదలనివ్వకుండా అడ్డం ప డ్డారు. ఈ సందర్భంగా కార్మికులు, పోలీసుల మ ధ్య బల ప్రదర్శన జరిగింది. అతి కష్టం మీద కార్మికులను చెల్లా చెదురు చేసి అరెస్టు చేసిన నేతలను సమీపంలోని చిలకలపూడి పోలీసు స్టేషన్ కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీ క త్తుపై విడుదల చేశారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ చిలకలపూడి పోలీసు స్టేషన్ వద్ద సైతం కా ర్మికులు ఆందోళన చేశారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో ఆఖిలపక్ష నేతలు ప్రభుత్వ చర్యల ను తీవ్రంగా ఖండించారు. జీవో నెం. 279తో కా ంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులను రోడ్డు పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. చర్చల పేరుతో కార్మిక సంఘ నేతలతో మాయ మాటలు చెబుతున్నారే తప్ప జీవో నెం. 279ని రద్దు చేస్తామని స్పష్టమైన హామీని ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. 279 జీవోను రద్దు చేసే వరకు నిరవధిక సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు షేక్ సలార్ దాదా, షేక్ అచ్చాబా, పల్లి శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రామిశెట్టి ప్రసాద్, గుమ్మడి విద్యాసాగర్, జనసేన నాయకుడు చిలంకుర్తి పృధ్వి ప్రసన్న, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొడాలి శర్మ, సీఐటీయు తూర్పు కృష్ణా అధ్యక్ష, కార్యదర్శులు చౌటపల్లి రవి, వై నరసింహరావు, బందరు డివిజన్ కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం, ఎఐటీయుసీ నాయకులు లింగం ఫిలిప్, కరపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మహాలక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనం
తోట్లవల్లూరు,అక్టోబర్ 16: మండలంలోని వల్లూరుపాలెం శ్రీకోదండ రామాలయంలో దేవీశరన్నవరాత్రులలో భాగంగా మంగళవారం అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని అన్ని రకాల నోట్లతో నాణాలతో అందంగా అలంకరించారు. భక్తులు భారీగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.