కృష్ణ

సీఎం కూచిపూడి పర్యటనకు పటిష్ఠమైన ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, అక్టోబర్ 16: నాట్యక్షేత్రం కూచిపూడిలో సిలికానాంధ్ర వసుధైక కుటుంబం నిర్మించిన 200 పడకల సంజీవని మల్టీ స్పెషాలిటీ వైద్యాలయం నిర్మాణానికి కారకులైన సిలికానాంధ్ర వ్యవస్థాపక చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ అభినందనీయుడని కలెక్టర్ లక్ష్మీకాంతం ప్రశంసించారు. ఈనెల 18న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా ఉదయం 11గంటలకు ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం వైద్యాలయం నిర్మాణాన్ని పరిశీలించి సీఎం పర్యటనకు సంబంధించి తీసుకొవల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించారు. అతిథులు, ఆహుతులకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వివిధ శాఖల అధికారులతో సమన్వయంగా కృషి చేసేందుకు డీపీఓ విక్టర్‌ను ఆదేశించారు. అగ్నిమాపక శాఖ, పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ, పోలీసు శాఖ, జిల్లా, మండల అధికారులు సమష్టిగా పనిచేయాలన్నారు. 2వేల మందికి పైగా హాజరయ్యే ఈ కార్యక్రమానికి 6వేల బాటిల్స్ మంచినీటిని ఉచితంగా అందచేసేందుకు జిల్లా టీడీపీ కార్యదర్శి, మొవ్వ వైస్ ఎంపీపీ నన్నపనేని వీరేంద్ర ముందుకువచ్చారు. ఆయన సభాస్థలి అలంకరణ, రహదారిలో అలంకరణ బాధ్యతలను బందరు ఆర్డీఓ ఉదయ భాస్కర్, వీరేంద్రలకు అప్పగించారు. హెలీప్యాడ్ నుండి సభ స్థలి వరకు దాదాపు 500 మీటర్ల ఆర్‌అండ్‌బీ రహదారికి ఇరువైపులా సైడ్‌వాల్స్ ఏర్పాటు చేసి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక శాఖ అధికారులు రహదారుల్లో దుమ్ము లేవకుండా చెట్ల పచ్చదనాన్ని కాపాడే విధంగా వాటరింగ్ చేయాలని సూచించారు. అనంతరం సంజీవని మల్టీ వైద్యాలయాన్ని సందర్శించి రోగులకు ఏర్పాటు చేసిన ఆధునిక, సాంకేతిక పడకలను పరిశీలించి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సభా స్థలిలో ఎన్‌ఆర్‌ఐలకు, వీఐపీలకు గ్యాలరీలు ఏర్పాటు చేయాలని, స్టేజీపై 30 మంది ఉండే విధంగా విశాలంగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి దాదాపు గంటన్నరపాటు కూచిపూడిలో ఉండే అవకాశం ఉందని కలెక్టర్ విలేఖర్లకు తెలిపారు. ఈ సమావేశంలో కూచిభొట్ల ఆనంద్, ఎంపీపీ కిలారపు మంగమ్మ, వైస్ ఎంపీపీ నన్నపనేని వీరేంద్ర, సమాచార శాఖ డీడీ భాస్కర నారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.

తారకరామ పథకం కాలువ పొడిగింపునకు చర్యలు
* రైతుల సమస్యపై స్పందించిన మంత్రి ఉమ
జి.కొండూరు, అక్టోబర్ 16: తారకరామ ఎత్తిపోతల పథకం కుడి ప్రధాన కాలువ పొడిగింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు మైలవరం ఎఎంసి చైర్మన్ వుయ్యూరు నరసింహారావు, ప్రభుత్వాసుపత్రి డైరెక్టర్ పటాపంచల నరసింహారావు తెలిపారు. జి.కొండూరులో నాల్గవ పంప్‌హౌస్ నుంచి ఒక కిలోమీటరున్నర పొడవునా చేపట్టిన కాలువ తవ్వకం పనులకు మంగళవారం భూమిపూజ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దొర్లింతల వాగు, పులివాగులోనికి తారకరామ నీళ్ళు వచ్చేటట్లుగా రైతుల కోరిక మేరకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదేశించారన్నారు. కాలువను పొలిమేర డొంక గుండా తవ్వనున్నట్లు తెలిపారు. రైతుల తరపున మంత్రి ఉమాకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ఉమా రైతుల సమస్యలపై చురుగ్గా స్పందిస్తున్నారన్నారు. సాగునీటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటి కప్పుడు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తారకరామ పథకంలో కొత్త మోటార్లను అమర్చుతున్నట్లు తెలిపారు. పట్టిసీమ దగ్గర పనిచేసే పంపులను తారకరామకు వినియోగించి ఎండిపోతున్న పంటలకు జీవం పోస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈకార్యక్రమంలో టిడిపి నాయకులు కందుల విశ్వకుమార్, గుజ్జర్లపూడి సాంబశివరావు, పజ్జూరు అంజయ్య, పజ్జూరు జగన్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానకి గుణపాఠం తప్పదు
* గౌతంరెడ్డి
తోట్లవల్లూరు,అక్టోబర్ 16: రెండు వారాల నుంచి తమ సమస్యలు పుష్కరించాలని మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిరంకుశతత్వంగా వ్యవహరించటం దారుణమని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి గౌతంరెడ్డి విమర్శించారు. విజయవాడలో మంగళవారం మున్సిపల్ కార్మికుల ఆందోళనలో పాల్గొన్న గౌతంరెడ్డి, వైసీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాదు శివరామకృష్ణ, విజయవాడ సిటి అధ్యక్షుడు విశ్వనాధ రవి, రాష్ట్ర కార్యదర్శి జివి నారాయణరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చిగురుపాటి బాబూరావు, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పి రవీంద్రబాబుతో పాటు 14 మందిని పోలీసులు అరెస్ట్ చేసి తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. పోలీస్‌స్టేషన్ వద్ద గౌతంరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ 290 జీఓని రద్దు చేయాలని, కార్మికులు చాలా కాలంగా కోరుతున్నా సీఎం చంద్రబాబునాయుడు పెడచెవిన పెడుతున్నారని అన్నారు. చివరకు ఆందోళనబాఠ పడితే ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేశారన్నారు. గౌతంరెడ్డి, బాబూరావులను పామర్రు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి కైలే అనిల్‌కుమార్, ఎంపీపీ కళ్ళం వెంకటేశ్వరరెడ్డి, జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి మోర్ల రామచంద్రరావు, మండల సిపిఎం కార్యదర్శి సీహెచ్ సుబ్బారావు పలువురు నాయకులు పరామర్శించి సంఘీభావం తెలిపారు.

శ్రీ మహాలక్ష్మీదేవిగా దుర్గామాత దర్శనం
మైలవరం, అక్టోబర్ 16: ద్వారకా తిరుమలలో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి దత్తత దేవాలయమైన మైలవరంలో వేంచేసియున్న శ్రీ కోట మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో జరుగతున్న 58వ దసరా మహోత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారిని మహాలక్ష్మీ దేవిగా అలంకరించి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా దసరానవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్థానిక దుర్గామోటార్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, శ్రీ దుర్గ్భావాని టాక్సీ స్టాండ్ ఆధ్వర్యంలో, శ్రీ షిరిడీ సాయి బాబా దేవస్థానం ఆధ్వర్యంలో, తారకరామానగర్‌లో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఆయా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో దుర్గామాత శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి ప్రసాదాలు స్వీకరించారు.