కృష్ణ

నేడు దుర్గమ్మకు రెండు విశిష్టాలంకారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 17: దసరామహోత్సవాల్లో చివరి రోజైన గురువారం అమ్మవారు రెండు విశిష్టమైన అలంకారాలతో భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనుంది. గురువారం వేకువ జామున 3గంటల నుండి ఉదయం సుమారు 11గంటల వరకు శ్రీ మహిషాసురమర్దనీదేవి అలంకారం, మధ్యాహ్నం 1గంట నుండి రాత్రి 11గంటల వరకు శ్రీ రాజరాజేశ్వరదేవీ అలంకారంతో భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనుంది. ఈ రెండు అలంకారాలతో దర్శనం ఇవ్వనున్న అమ్మవారిని దర్శించుకోవటానికి భక్తులకు రెండు పూటలా ఇంద్రకీలాద్రికి వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. రద్ధీకి అనుగుణంగానే ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే ఈవో వీ కోటేశ్వరమ్మ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా 8వ రోజైన బుధవారం ఉదయం 11గంటల సమయానికి సుమారు 8లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. చివరి రోజైన గురువారం వచ్చిన రెండు అలంకారాలంతోపాటు వచ్చే భక్తుల సంఖ్య, తర్వాత రోజైన శుక్రవారం అన్నింటి దృష్టిలో పెట్టుకొని ఈవో కోటేశ్వరమ్మ ఆదేశాలతో సెక్షన్ పర్యవేక్షకుడు విజయ్‌కుమార్ సుమారు 3లక్షల లడ్డూలను బుధవారం సాయంత్రం 7గంటల సమయానికి సిద్ధం చేయనున్నారు. అమ్మవారి లడ్డూల కోసం భక్తులు ఎవరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సిబ్బంది లడ్డూల సిద్ధం చేసే పనిలో పడ్డారు.

నేడు పూర్ణాహుతి, తెప్పోత్సవం
ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 17: దసరా మహోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ఈకార్యక్రమంతో దసరా మహోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. సాయంత్రం పవిత్ర కృష్ణానదీలో అమ్మవారి తెప్పోత్సవం కన్నుల పండువగా జరగనుంది. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి సర్వాభరణాలు ధరించి పవిత్ర కృష్ణానదీలో జలవిహారం చేస్తారు. ఈకార్యక్రమానికి నగరానికి చెందిన అతిరథ మహారథులు విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంతో దసరా మహోత్సవాలు పరిసమాప్తం అవుతాయి.

వైభవంగా నగరోత్సవం
ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 17: దసరా మహోత్సవాల్లో భాగంగా 8వ రోజైన బుధవారం సాయంత్రం అమ్మవారికి నగరోత్సవ ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి ఈఊరేగింపు మహోత్సవం ప్రారంభమైంది. పుష్పాలతో అలకరించిన పల్లకిలో అమ్మవారు, స్వామిని ఉంచారు. దేవస్థానం స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్, ఈవో వీ కోటేశ్వరమ్మ, చైర్మన్ గౌరంగబాబు, ధర్మకర్తలు వెలగపూడి శంకరబాబు, గూడపాటి పద్మశేఖర్ చేత ప్రత్యేక పూజలు చేయించిన తర్వాత స్వామి ఊరేగింపు మహోత్సవం ప్రారంభమైంది. దేవస్థానం సహాయ ఈవో శ్రవణం అచ్యుత రామయ్యనాయుడు, పర్యవేక్షకుడు అమృతరావు,ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

బాలారిష్టాలు దాటి అభివృద్ధిని సాధించాలని కోరుకున్నా
* స్పీకర్ కోడెల శివప్రసాద్
విజయవాడ (ఎడ్యుకేషన్), అక్టోబర్ 17: కొత్తగా ఏర్పడిన రాష్ట్రం బాలారిష్టాలను దాటి అభివృద్ధి దిశగా సాగాలని దుర్గమ్మని కోరుకున్నానని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గాష్టమి రోజున బుధవారం ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గాదేవి అవతారంలో దుర్గమ్మను కుటుంబ సభ్యులతో కలిసి కోడెల దర్శించుకున్నారు. పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు, సభ్యులు స్పీకర్‌కు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు, ఈవో వీ కోటేశ్వరమ్మ దుర్గమ్మ క్యాలండర్, ప్రసాదాలను అందించారు. అనంతరం మీడియా పాయింట్‌లో కోడెల మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గమ్మ పాదాల వద్ద ఏర్పడిన రాజధాని అమరావతి నిర్మాణం అతి త్వరగా పూర్తికావాలని దుర్గమ్మను కోరనన్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ కారణంగా ఇక్కట్లు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఆశీస్సులు అందించాలని కోరుకున్నానన్నారు. అభివృద్ధికి అడ్డుపడే రాజకీయశక్తులను అడ్డుకోవాలని దుర్గమ్మను కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో మంచినీరు, సాగునీరు కొరతలేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి చేపట్టిన నదుల అనుసంధానానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని అమ్మవారిని వేడుకున్నానన్నారు.