కృష్ణ

దాతల దాతృత్వానికి సార్ధకత ‘సంజీవని’ వైద్యాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: దాతల దాతృత్వానికి సార్ధకత చేకూర్చే సిలికానాంధ్ర సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. నాట్యక్షేత్రం కూచిపూడిలోని పశుమర్తి వారి ధర్మచెరువులో సిలికానాంధ్ర వసుధైక కుటుంబం ఆర్థిక సహకారంతో పాటు నాట్యారామ కమిటీ, సిలికానాంధ్ర వ్యవస్థాపక చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ అవిరళ కృషి, దాతల ఆర్థిక సహకారంతో రూ.65కోట్ల అంచనాలతో నిర్మించిన సంజీవని మల్టీ స్పెషాలిటీ వైద్యాలయాన్ని గురువారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. 200 పడకల మల్టీ స్పెషాలిటీ వైద్యాలయం ఐదు అంతస్తుల విశాలమైన భవనంలో సెంట్రల్ ఏసీతో నిర్మించబడింది. జిల్లాలోనే గ్రామీణ ప్రాంతంలో తొలి సారిగా అత్యంత ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాలతో నిర్మించిన ఈ వైద్యాలయం ఎందరో దాతల దాతృత్వానికి సార్ధకత చేకూర్చనుంది. అన్ని రకాల వైద్య పరీక్షలతో పాటు తక్కువ ఖర్చుతో అత్యంత ఆధునికమైన సామాన్యుడు సైతం అందుకునే విధంగా ఈ ఆసుపత్రి రూపొందించారు. పేదవాడి జబ్బును చూసి వారికి పూర్తి ఆరోగ్యం కలిగించటమే ప్రధాన లక్ష్యంగా జేబులు చూసి కాకుండా ఉత్తమ వైద్యం అందించేందుకే ఈ వైద్యాలయం ఏర్పడింది. దాదాపు 200 మంది వైద్యులు అమెరికా, కెనడా వంటి దేశాలలో ఎంతో పేరుగడించిన వైద్యులే స్వయంగా ఇక్కడకు వచ్చి వైద్య సేవలు అందించటం ఈ ప్రాంత వాసులకు అత్యంత శుభదాయకం. జిల్లాకే మణికిరీటంగా మారనున్న సిలికానాంధ్ర సంజీవని మల్టీ స్పెషాలిటీ వైద్యాలయ నిర్మాణం నాట్యక్షేత్రం కూచిపూడికి 2వ మణిహారంగా పేర్కొనవచ్చు. 14వ శతాబ్ధంలో శ్రీ సిద్ధేంద్రయోగి భామా కలాపం నృత్యంతో కూచిపూడి నాట్యం విశ్వవిఖ్యాతమైంది. కళాలోకానికే పరిమితమైన ఈ నాట్య కళ సిలికానాంధ్ర వసుదైక కుటుంబం చొరవతో గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మూడు సార్లు నమోదు కావటంతో మేథావుల్లో సైతం ఈ నాట్యం పట్ల ఆసక్తి పెరిగింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన కూచిపూడి నాట్యానికి పుట్టినిల్లైన నాట్యక్షేత్రం కూచిపూడి అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోవటంతో తిరిగి సిలికానాంధ్ర వసుధైక కుటుంబం చొరవతో గ్రామం మొత్తం సీసీ రోడ్లతో అభివృద్ధి, పంచాయతీ భవనం, జెడ్పీ ఓరియంటల్ పాఠశాల, బస్టాండ్‌ల అభివృద్ధి చెందాయి. అంతటితో ఆగకుండా కోట్లాది రూపాయల వ్యయంతో సంజీవని మల్టీ స్పెషాలిటీ వైద్యాలయం నిర్మించి సిలికానాంధ్ర కూచిపూడి గ్రామానికి రెండవ మణిహారాన్ని అందచేసి 150 గ్రామాల ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచే అవకాశం ఏర్పడింది.