కృష్ణ

‘సంజీవని’కి ప్రభుత్వం చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, అక్టోబర్ 19: సిలికానాంధ్ర వసుదైక కుటుంబం, దాతల విరాళాలతో నిర్మించిన సంజీవని మల్టీ స్పెషాలిటీ వైద్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగింది. రూ.60 కోట్లతో నిర్మించిన వైద్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. కార్యక్రమానికి అతిరథ మహారథులతో పాటు ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఆస్పత్రిలో ప్రవాసాంధ్రులతో ప్రత్యేకంగా సమావేశమై ముచ్చటించారు. ఆస్పత్రి నిర్మాణానికి ప్రవాసాంధ్రులు అందించిన చేయూతను ఆయన అభినందించారు. అత్యాధునిక సౌకర్యాలతో కార్పొరేట్ స్థాయి వైద్యాలయం నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషి చేసిన సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు, కూచిపూడి నాట్యారామ నిర్మాణ కమిటీ చైర్మన్ కూచిభొట్ల ఆనంద్‌ను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన మరో రూ.10కోట్లను ప్రభుత్వం ద్వారా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నాట్య క్షేత్రం కూచిపూడిని ప్రపంచ పారిశ్రామిక, ప్రకృతి వ్యవసాయ కేంద్రంగా, శాస్త్ర సాంప్రదాయ కూచిపూడి నాట్య వారసత్వ గ్రామంగా, ఆరోగ్య కేంద్రంగా అభివృద్ధి పర్చేందుకు కృషి చేస్తానన్నారు. ఈ ఆస్పత్రి ద్వారా కూచిపూడి పరిసర ప్రాంతాలకు చెందిన 150 గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. రైతులను ప్రోత్సహించి ప్రకృతి వ్యవసాయ కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. తొలుత గ్రామ శివారు ప్రాంతంలో నన్నపనేని వీరేంద్ర వెంచర్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక హెలీప్యాడ్ వద్ద సీఎం చంద్రబాబుకు కలెక్టర్ లక్ష్మీకాంతం, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, వైస్ ఎంపీపీ నన్నపనేని వీరేంద్ర తదితరులు ఘన స్వాగతం పలికారు. నన్నపనేని యువసేన పర్యవేక్షణలో సంజీవని మల్టీ స్పెషాలిటీ వైద్యాలయానికి సీఎంకు తీడుకొని వచ్చారు. అనంతరం ఆస్పత్రిని సీఎం ప్రారంభించారు. ఆసుపత్రి నిర్మాణానికి విరాళాలు అందించిన దాతలు, ప్రవాస భారతీయుల కుటుంబాలతో చంద్రబాబు ముచ్చటించారు. ఆస్పత్రి నిర్మాణానికి పెద్ద ఎత్తున విరాళాలు సేకరణలో కీలక పాత్ర పోషించిన టీవీ 9 సీఇఓ రవి ప్రకాష్‌ను సీఎం చంద్రబాబు దుశ్శాలువాలతో సత్కరించారు.

ప్రయాణీకుల పాట్లు :
ముఖ్యమంత్రి రాక సందర్భంగా కూచిపూడి గ్రామానికి ఆర్టీసీ బస్సులను రద్దు చేయడంతో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. మధ్యాహ్నం 12 గంటలు నుండి రాత్రి 6గంటలు వరకు అవనిగడ్డ నుండి విజయవాడ, గుడివాడ ఆర్టీసీ బస్సులను బార్లపూడి, కృష్ణాపురం మీదుగా విజయవాడకు, మొవ్వ, పెదముత్తేవి అయ్యంకి మీదుగా గుడివాడకు మళ్లించడంతో కూచిపూడికి రావల్సిన ప్రయాణీకులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

అన్నీ తానైన కలెక్టర్
సీఎం పర్యటన విజయవంతంలో కలెక్టర్ లక్ష్మీకాంతం అన్నీ తానై వ్యవహరించారు. సిలీకానాంధ్ర సంజీవని మల్టీ స్పెషాలిటీ వైద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం పట్ల నిరాశావాదులు రేకెత్తించిన పుకార్లకు దీటుగా కలెక్టర్ గురువారం ఉదయం 11గంటలకే కూచిపూడి విచ్చేయటంతో ముఖ్యమంత్రి రాకపై స్తబ్ధతగా ఉన్న అధికారుల్లో చలనం ఏర్పడింది. దీంతో అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, ఏఆర్ పోలీసులు, బందరు డివిజన్ పోలీసులు, రాబెట్ స్క్వాడ్ ఒక్కసారిగా గ్రామంలో సంచరిస్తుండటంతో ప్రజల్లో చైతన్యం ఏర్పడింది. ముఖ్యమంత్రి వస్తున్నారని తెలియటంతో అధికారులు తమ విధుల్లో లీనమయ్యారు. మొవ్వ వైద్య, ఆరోగ్య శాఖ సభా స్థలి వద్ద ప్రత్యేక వైద్య శిబిరాన్ని, విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. తహశీల్దార్ బి రామానాయక్, స్వచ్చాంధ్ర కార్యకర్తలు అతిథులను ఆహ్వానించారు. నన్నపనేని యువసేన భోజన సౌకర్యాలను కల్పించారు. ముఖ్యమంత్రి రాకకు ఆహ్వానం పలుకుతూ పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేశారు. జిల్లా పంచాయతీ అధికారి ఆర్ విక్టర్ పర్యవేక్షణలో డీఎల్‌పీఓ సత్యనారాయణ, అధికారులు నిలిచిన వర్షం నీరు తొలగించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయటంతో సభ విజయవంతమైంది.