కృష్ణ

గ్రామాల్లో సమర్థవంతంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 20: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌ను సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో జిల్లాను నిలపడమే కాకుండా సీఎం చంద్రబాబు నాయుడుచే పురస్కారం పొందేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు. ఈమేరకు నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ అధికారులతో వ్యవసాయ, అనుబంధ రంగాలు, ఉపాధి హామీ పనులపై నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని 970 గ్రామ పంచాయతీల్లో వచ్చే గురువారం నాటికల్లా ఆయా కేంద్రాలను పూర్తిచేయడమే కాకుండా ఇప్పటికే పూరె్తైన 886 తయారీ కేంద్రాల వివరాలను అప్‌లోడ్ పూర్తి చేయాలన్నారు. నాలుగేళ్లలో సాధించిన ప్రగతి, భవిష్యత్తులో చేపట్టనున్న పనుల విజన్‌పై డాక్యుమెంట్ రూపొందించాలన్నారు. ప్రజల సంతృప్తి పెరగాలని తెలిపిన కలెక్టర్ పెన్షన్లు, రెవెన్యూ సేవలు, సివిల్ సప్లయ్ తదితర అంశాల్లో మొదటి స్థానం రావాలన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచి వారి వేతనాలు లక్ష్యానికి మించి ఉండాలన్నారు. వరినాట్లు పూర్తయి కోతలు వచ్చే నాటికి విరామ సమయంలో ఉపాధి హామీలో అన్ని పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆట స్థలాలు, స్మశాన వాటికలు, పంట కుంటలు, నివాసిత ప్రాంతాల్లో ఇంకుడు గుంటల నిర్మాణం, చేపట్టాలన్నారు. సీసీ రోడ్డు, బీటీ రోడ్లు, లింకు రోడ్లు ఎస్సీ ఎస్టీ నివాసిత ప్రాంతాల్లో నూరుశాతం జరగాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటును పూర్తి చేసి టెన్ స్టార్ రేటింగ్ తీసుకురావాలని తెలిపారు. సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీ చేసి ప్రకృతి సేద్యంను ప్రోత్సహించాలన్నారు. ఈనెల 25న సింగ్‌పూర్ విమానం గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్నందున ఎటువంటి పెండింగ్ పనులు లేకుండా సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

దసరా ఉత్సవాలు ముగిసినా తగ్గని భక్తుల రద్దీ
* భారీగా వచ్చిన భవానీలు
ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 20: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా మహోత్సవాలు గురువారంతో ముగిసినప్పటికీ భక్తుల రద్ధీ ఏమాత్రం తగ్గలేదు. ఉత్సవాల్లో వివిధ కారణాల వలన దర్శనం చేసుకోలేని భక్తులు అధికంగా రావటంతోపాటు అదనంగా భవానీలు సైతం అధికంగా శనివారం ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. వేకువ జామున 5గంటలకు ప్రారంభమైన భక్తుల రద్ధీ మధ్యాహ్నం 3గంటల వరకు కొనసాగింది. రద్ధీని దృష్టిలో పెట్టుకొని ఈవో వీ కోటేశ్వరమ్మ ఏర్పాట్లు యథాతథంగా ఉంచారు. దీంతో అటు భవానీలు, ఇటు భక్తులు అవే మార్గం గుండా కొండపైకి చేరుకుని అమ్మవారిని లఘు దర్శనం చేసుకున్నారు. ఉదయం 8గంటల సమయంలో అమ్మవారి దర్శనానికి భక్తులకు రెండు గంటల సమయం పట్టింది. అమ్మవారిని దర్శనం చేసుకున్న భవానీలు శ్రీ మల్లిఖార్జున మహామండపం వద్దకు ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద ఇరుముడి పూజా సామగ్రిని సమర్పించి మెడలోని దీక్షామాలలను అర్చకస్వాముల చేత తీయించుకున్నారు. తర్వాత కనకదుర్గనగర్‌లో ఏర్పాటు చేసిన కౌంటర్‌లలో ప్రసాదాలను కొనుగోలు చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భవానీలు దుర్గా ఘాట్‌లో పవిత్ర స్నానాలు ఆచరించి ఇరుముడులకు ప్రత్యేక పూజలు చేసి గురుభవానీల ఆధ్వర్యంలో ఇరుముడులను శిరస్సుపై ధరించి జై దుర్గా భవానీకి జై అంటూ గిరి ప్రదక్షణ చేసిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.

పాలకాయతిప్ప బీచ్‌కు పర్యాటక శోభ
కోడూరు, అక్టోబర్ 20: కృష్ణానది సముద్రంలో కలిసే ప్రదేశం, ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న హంసలదీవి, పాలకాయతిప్ప బీచ్‌ను పర్యాటకుల స్వర్గదామంలా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ కమిషన్ సెక్రటరీ సంజీవ్ గుప్తా పేర్కొన్నారు. శనివారం ఆయన కుటుంబ సభ్యులతో పాలకాయతిప్ప బీచ్‌ను సందర్శించారు. సముద్రంపై నుంచి వీచే చల్లని గాలులు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తున్నాయన్నారు. కృష్ణా అభయారణ్యం అవనిగడ్డ రేంజ్ ఫారెస్ట్ అధికారిణి జె భవానీ ఇక్కడి బీచ్ ప్రాముఖ్యతను వివరిస్తూ అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఇటీవల నాగాయలంక శ్రీరామపాదక్షేత్రం లోపల లంక భూములపై సంక్రాంతి పర్వదినం సందర్భంగా గుడిరాలు వేసిన మాదిరిగా ఇక్కడ పర్యాటకుల కోసం ఏర్పాటు చేసి ఒక కాపీ షాప్, అదనంగా వాష్‌రూమ్స్ నిర్మాణాలు చేపట్టి పర్యాటకులు విడిది చేసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించినట్లు ఆయన తెలిపారు. అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు, కోడూరు ఎస్‌ఐ ప్రియ కుమార్ ఆయన వెంట ఉన్నారు.