కృష్ణ

అమ్మవారి సన్నిధిలో అంతా సమానులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 20: అమ్మవారి దసరా మహోత్సవాల్లో మొత్తం 9రోజుల్లో సుమారు 18 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లు శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఈవో వీ కోటేశ్వరమ్మ తెలిపారు. శ్రీ మల్లిఖార్జున మహామండపం 6వ అంతస్తులో శనివారం ఉదయం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ దేవస్థానం చరిత్రలో 18లక్షల మంది భక్తులు దుర్గమ్మను దర్శనం చేసుకోవటం ఒక అరుదైన రికార్డుగా చెప్పవచ్చున్నారు. ఒక మూలా నక్షత్రం రోజైన ఆదివారం సుమారు 4లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారన్నారు. కెనాల్‌రోడ్ వినాయకుడి గుడి వద్ద 4క్యూమార్గాలను ఏర్పాటు చేశామని, ఉచిత దర్శనం క్యూమార్గంలో కూడా ఒకేసారి సుమారు 5వేల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోనేలా ఏర్పాట్లు చేయటంతో ఈ రికార్డు సాధ్యమైందన్నారు. మూలా నక్షత్రం, చివరి రెండు రోజుల్లో అధికంగా భక్తుల రద్దీ కారణంగానే అందరికీ అంతరాలయం దర్శనం రద్దుచేసి లఘు దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూలానక్షత్రం రోజైన ఆదివారం, మిగత మూడు రోజుల పాటు భక్తులందరికీ అమ్మవారి అన్న ప్రసాదాన్ని అందించాలనే లక్ష్యంతో బఫే పద్ధతిని ప్రవేశపెట్టామన్నారు. ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టిన అప్పం ప్రసాదాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయని, 9రోజుల్లో సుమారు 7లక్షల అప్పంలు, 11లక్షల మేరకు అమ్మవారి కుంకుమ ప్రసాదాలను అందచేసినట్లు పేర్కొన్నారు. ఇంజనీరింగ్, శానిటేషన్ రెండింటికి కలిసి సుమారు రూ.2కోట్ల ఖర్చు, నగరోత్సవం, సెక్యురిటీ, స్టేషనరీ సెక్షన్‌లకు కలిసి రూ.కోటి, కల్చరల్, వేద సభ, అర్చక సభ, సుమారు రూ.20లక్షలు, వీఎంసీ, ఫైర్, ఇరిగేషన్‌కు రూ.63లక్షలు, పోలీసులకు రూ.82లక్షలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 5,683 మంది పోలీసులు విధులు నిర్వహించారన్నారు. రాబోయే రోజుల్లో ప్రతిరోజు ఎంతమంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారనే విషయాన్ని శాస్ర్తియ పద్ధతిలో లెక్కించేలా ఒక ప్రణాళిక రూపొందించటానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. వీఐపీలు అమ్మవారి దర్శనం నిమిత్తం వచ్చిన సమయంలో రూ. 300 దర్శనం టిక్కెట్‌లు కొనుగోలు విషయాన్ని వారి విజ్ఞతకే వదిలేశామని ఒక ప్రశ్నకు జవాబుగా ఈవో చెప్పారు. అంతఃకరణ శుద్ధితో ప్రతిఒక్కరూ అమ్మవారి సన్నిధిలో మెలగాలన్నారు. అందరికీ సంపూర్ణ సహకారం అందిస్తే ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయటంతో పాటు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నారు. దసరా మహోత్సవాల బడ్జెట్ రూ.8.40 కోట్లుగా ఈవో ముందుగానే ప్రకటించి అదేవిధంగా ఖర్చు చేయగా, అమ్మవారికి వివిధ రూపాల్లో 9రోజులకు కలిసి రూ.4కోట్లు ఆదాయం లభించటం విశేషం. దసరా మహోత్సవాలను విజయవంతంగా పూర్తి చేయటంలో సంపూర్ణ సహకారం అందించిన కలెక్టర్, పోలీస్ కమిషనర్ ద్వారకాతిరుమలరావు, కమిటీ చైర్మన్, ధర్మకర్తలు, మీడియా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, దేవదాయ శాఖ సిబ్బంది, అందరికీ ఈవో కోటేశ్వరమ్మ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విలేఖరుల సమావేశంలో దుర్గగుడి కమిటీ చైర్మన్ వీ గౌరంగబాబు, కమిటీ ధర్మకర్తలు వెలగపూడి శంకరబాబు, గూడపాటి పద్మశేఖర్, బీ ధర్మారావు, సహాయ ఈవో శ్రవణం అచ్యుతరామయ్యనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న పోలీస్ బ్యాండ్
మచిలీపట్నం (కల్చరల్), అక్టోబర్ 20: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి లక్ష్మీటాకీసు సెంటరులో నిర్వహించిన పోలీసు బ్యాండ్ పుర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. రిటైర్డు బ్యాండ్ మాష్టార్ పోతయ్య నేతృత్వంలో ఎఆర్ బ్యాండ్ పార్టీ సభ్యులు పలు దేశ భక్తి గీతాలను బ్యాండ్ ద్వారా అత్యద్భుతంగా పాడి శ్రోతలను రంజింప చేశారు. వీరిని అడిషనల్ సూపరింటెండెంట్ సోమంచి సాయికృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ యండి మెహబూబ్ బాషా, ఎఆర్ డీఎస్పీ నారాయణరావు, ట్రాఫిక్ డీఎస్పీ పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.