కృష్ణ

జన్మభూమిని మరువొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యూరు, అక్టోబర్ 21: రైతులు గ్రామాలు వీడొద్దని,జన్మభూమిని మరువ వొద్దని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. స్ధానిక ఎజి అండ్ ఎస్‌జి సిద్ధార్ధ కళాశాలలో ఆదివారం మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రచించిన చెరగని జ్ఞాపకాలు-తరగని తృప్తి పుస్తకావిష్కరణ, ఆయన 76వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగిస్తూ ప్రజాప్రతినిధిగా తాను ప్రజాజీవితంలో ఉన్న సమయంలో తనకు సహకరించిన అధికారులను, మిత్రులను గుర్తుంచు కొని సత్కరించడం అభినందనీయమన్నారు. మాజీ ఐపిఎస్ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దివంగత రైతు నేత ఎన్‌జి రంగా, రైతు నాయకులు యలమంచలి శివాజీ, వడ్డే లు రాష్ట్ర వ్యవసాయ రంగానికి త్రిమూర్తుల వంటివారని, సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు వృద్ధులైన వడ్డే కూర్చుని,తమను నడపాలని కోరారు. ఈ సమావేశంలో విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, ఐఎఎస్ అధికారులు రాజేష్ భట్టాచార్య, బి.ఆర్.మీనా, సైలేంద్రకుమార్‌జోషి, విశ్రాంత అధికారులు పి.బాలసుబ్రహ్మణ్యం, కె.అజయ్‌కుమార్, మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, యలమంచలి శివాజీ, కరణం బలరాం, సత్యవాణి, దావులూరి శివరామకృష్ణయ్య, ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే, జి.వి.ఎల్ రామారావుతో పాటు పలువురు వడ్డేను సత్కరించి, ప్రసంగించారు. అంతకు ముందు ఈ కార్యక్రమానికి వచ్చిన న్యాయమూర్తులు లావు నాగేశ్వరరావును, జస్టిస్ చలమేశ్వర్‌లను స్థానిక బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు కాగిత గోపిచంద్, నందం సుదర్శన్, అలీబేగ్ తదితరులు పాల్గొన్నారు.