కృష్ణ

ఎత్తిపోతలతో సాగునీటి సమస్యకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, అక్టోబర్ 21: చింతలపూడి, ముక్త్యాల ఎత్తిపోతల పథకాల ద్వారా నందిగామ ప్రాంతంలో శాశ్వత సాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం రాత్రి పట్టణంలో జరిగిన పలు కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత కోర్టు రోడ్డులో చిరుమామిళ్ల చిన్ని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఆర్‌ఒ ప్లాంట్‌ను సందర్శించి వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలపై వారిని అభినందించారు. అనంతరం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయాన్ని సందర్శించి ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన చాంబర్ అధ్యక్షుడు యేచూరి రాము, ఇతర కార్యవర్గ సభ్యులను అభినందించారు. వాసవీ మార్కెట్‌లో నవరాత్రి పందిరిలో ఏర్పాటు చేసిన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. తదుపరి విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దివంగత మంత్రి దేవినేని వెంకట రమణ ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఈ ప్రాంత రూపురేఖలు మార్చి ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అనంతరం ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా తాను, దివంగత ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేశామన్నారు. ముక్త్యాల, చింతలపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా నందిగామ ప్రాంతంలో శాశ్వత సాగునీటి పరిష్కారం చూపి భూములను సస్యశ్యామలం చేస్తానని హర్షధ్వానాల మధ్య హామీ ఇచ్చారు. విశ్రాంత ఉద్యోగుల భవనానికి రూ.2లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. పెద్ద ముఠాకు చెందిన 30 కుటుంబాల వారు మంత్రి ఉమా సమక్షంలో తెదేపాలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పిసాదరంగా ఆహ్వానించారు.