కృష్ణ

అవనిగడ్డలో నూరు శాతం ఎల్‌ఈడీ బల్బులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, అక్టోబర్ 23: స్థానిక గ్రామ పంచాయతీలో నూరు శాతం ఎల్‌ఇడీ బల్బులు ఏర్పాటు చేయటం ద్వారా నూతన వెలుగులు, శోభను తీసుకురానున్నట్లు రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం గ్రామ పంచాయతీకి చేరిన 5,400 ఎల్‌ఇడీ బల్బులను ఆయన పరిశీలించారు. ఈ బల్బులను ప్రతి వీధిలో ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఘంటసాల మండలం పాపవినాశనం గ్రామంలో అంతర్గత రహదారుల నిర్మాణానికి పంచాయతీరాజ్ నిధులు రూ.75లక్షలు మంజూరైనట్లు తెలిపారు. దీంతో ఆ గ్రామంలోని రహదారులు సిమెంట్ రోడ్లుగా మారుతాయన్నారు. నిధులు మంజూరు చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్‌కు బుద్ధప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటేశ్వరరావు, ఎఇ గోపాలరావు పాల్గొన్నారు.

శ్రీకొండలమ్మ సన్నిధిలో వేదసభ
గుడ్లవల్లేరు, అక్టోబర్ 23: మండల పరిధిలోని వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో సోమవారం రాత్రి బ్రహ్మశ్రీ విష్ణ్భుట్ల సూర్యనారాయణ శర్మ ఘనపాఠి ఆధ్వర్యంలో వేదసభ, వేదస్వస్తి నిర్వహించారు. వేద సభలో 163 మంది పండిత విద్వాంసులు పాల్గొని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదంలలో వేద పారాయణ గావించారు. సభ అనంతరం పండితులు అందరికీ అమ్మవారి ప్రసాదం, తాంబూలం సమర్పించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్డల మండలి చైర్మన్ బెల్లంకొండ ఏడుకొండలు, ఆలయ కార్యనిర్వహణాధికారి గోగినేని లీలాకుమార్, ధర్మకర్తలు కానూరి సత్యనారాయణ, చిట్టిబొమ్మ వెంకట నరసమ్మ, చాపరాల రాజేశ్వరరావు, మాదాసు వెంకట శివ రామకృష్ణ, మనె్నం సత్యనారాయణ, దిమ్మల ఇశ్రాయేలు, కొప్పినేని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

సబ్సిడీపై మినీ గోకులాలు
కూచిపూడి, అక్టోబర్ 23: రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం 90 శాతం సబ్సిడీపై మినీ గోకులాలు ఏర్పాటు చేస్తోందని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పేర్కొన్నారు. మొవ్వ మండలం నరసన్నపాలెంలో రూ.21లక్షలతో నిర్మించనున్న గోకులానికి ఎమ్మెల్యే కల్పన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఆర్థిక స్వావలంబనకు చేయూతనిస్తుందన్నారు. పామర్రు నియోజకవర్గానికి ఐదు గోకులాలు, 40 మినీ గోకులాలు మంజూరయ్యాయన్నారు. ఈ పథకం కింద పాడి పశువులకు రూ.లక్ష, నాలుగు పశువుల షెడ్ల నిర్మాణానికి రూ.లక్షా 50వేలు, ఆరు పశువుల షెడ్డుకు రూ.లక్షా 80వేలు ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఇందులో 10శాతం మాత్రమే పేద, బడుగు వర్గాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

భక్తుల మనోభావాలను కాపాడాలి
హనుమాన్ జంక్షన్, అక్టోబర్ 23: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం విషయంలో ప్రభుత్వాలు భక్తుల మనోభావాలను కాపాడాలని కోరుతూ హనుమాన్ జంక్షన్‌లో అయ్యప్ప భక్తులు ప్రదర్శన చేపట్టారు. స్ధానిక అభయాంజనేయ స్వామి దేవస్ధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో అయ్యప్ప మాలధారణ చేసుకున్న భక్తులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈసందర్భంగా బాపులపాడు మండల బీజేపీ నాయకుడు మురళీధర్, గురుస్వాములు పూర్ణ చంద్రరావు, విష్ణు, మధు తదితరులు భక్తుల మనోభావాలను కాపాడాలని నినాదాలు చేశారు. కోర్టు తీర్పుల కంటే భక్తుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. భక్తులు గందరగోళానికి గురికావాల్సి వస్తోందన్నారు.