కృష్ణ

బాణసంచా అక్రమ నిల్వలు సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 23: బాణసంచా అక్రమంగా నిల్వచేసే వారిని ఉపేక్షించేది లేదని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో జిల్లాలో ఎక్కడైనా అనుమతులు లేకుండా బాణసంచా, పేలుడు పదార్థాలను అక్రమంగా నిల్వ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనావాసాల మధ్య అక్రమ నిల్వలు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అక్రమ బాణసంచా నిల్వలపై నిరంతరం దాడులు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిల్వ చేసినా, బాణసంచా తయారు చేసినా చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. బాణసంచా విక్రయాలకు విధిగా అనుమతులు తీసుకోవాలన్నారు. జిల్లా అధికార యంత్రాంగం నిర్ధేశించిన ప్రాంతాల్లోనే అమ్మకాలు చేపట్టాలన్నారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా సహించేది లేదన్నారు. దాడుల్లో పట్టుబడ్డ వారికి పేలుడు చట్టం 1884 సెక్షన్ 9(బి) ప్రకారం మూడు సంవత్సరాలు జైలు, రూ.5 వేలు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. అలాగే సెక్షన్ 9-బి2 ప్రకారం రెండు సంవత్సరాలు జైలు, రూ.5వేలు జరిమానా, సెక్షన్ 9-బి3 ప్రకారం సెక్షన్ 6ఎ ప్రకారం మూడు సంవత్సరాల జైలు, రూ.5 వేలు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా అక్రమంగా బాణసంచా నిల్వలు ఉన్నట్లు తెలిస్తే డయల్ 100 ద్వారా గానీ, పోలీసు స్టేషన్‌లలో గానీ ఫిర్యాదు చేయవద్దని ఎస్పీ త్రిపాఠి తెలిపారు.

విద్యతోనే మనిషికి వికాసం
* కలెక్టర్ లక్ష్మీకాంతం
నూజివీడు, అక్టోబర్ 23: ప్రతి మనిషికి క్రమశిక్షణతో కూడిన విద్య అవసరమని, విద్య ద్వారా సాంస్కృతమైన వికాసం, కుటుంబ వికాసం, సమాజ వికాసం కలుగుతుందని, మనిషి వంద సంవత్సరాలు బతికినా ఒక్క దైవ కార్యమైనా చేయకపోతే ఆ జీవితం వ్యర్థమని జిల్లా కలెక్టరు బి లక్ష్మీకాంతం అన్నారు. నూజివీడులోని సరస్వతి ఆలయ నిర్మాత పోతినేని గోపాలకృష్ణయ్య చతుర్థ ఆరాధన ఉత్సవానికి మంగళవారం జిల్లా కలెక్టరు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లైఫ్ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ వంటిదన్నారు. కనకదుర్గమ్మ అత్యంత శక్తివంతమైన అమ్మ అని చెప్పారు. దసరా పండుగ అంటే పది లోభగుణాలైన కామ, క్రోధ, మధ, మత్సర వంటి దుర్గుణాలపైన ఎవరు నిజమైన విజయం సాధిస్తారో అదే దసరాకు అర్థమని చెప్పారు. అంతకు ముందు మహా సరస్వతి ఆలయ ఆహ్వాన కమిటి జిల్లా కలెక్టరు లక్ష్మీకాంతంకు పూర్ణకుంభం, మేళా తాళాలతో, ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఇది మహాసరస్వతమ్మ ఆలయమని, దీనిని అభివృద్ది చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ ఆలయ అభివృద్దికి కావాల్సిన ఏర్పాట్లను జిల్లా యంత్రాగానికి విన్నవిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ కాపా శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి రమేష్, ఎంపీడీఓ పి అనూరాధ, తహశీల్దార్ జి విక్టర్‌బాబు, డివిజనల్ పంచాయితీ అధికారి ఎంఎస్ బాలయోగి, పీజి సెంటరు ప్రత్యేక అధికారి ఎంవి బసవేశ్వరరావు, శ్రీవిద్య పీఠాధిపతులు వాసుదేవనందగిరిస్వామి, ఆధ్యాత్మీక ప్రసంగికురాలు భారతీయం సత్యవాణి, సరస్వతి ఆలయ ప్రతినిధి కోనేరు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ల్యాండ్ సీలింగ్ భూముల పరిశీలన
పామర్రు, అక్టోబర్ 23: హైకోర్టు ఉత్తర్వుల మేరకు పామర్రు మండలం కొమరవోలులోని 11 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూములను గుర్తించి రెవెన్యూ శాఖ ఆధీనంలోకి తీసుకునే నిమిత్తం గుడివాడ ఆర్డీఓ జి సత్యవాణి మంగళవారం కొమరవోలులో ఆయా భూములను పరిశీలించారు. అనంతరం ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ ల్యాండ్ సీలింగ్ భూములను నిబంధనల మేరకు స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. గ్రామానికి చెందిన మేడూరి ప్రసాద్, చూడామణి, సినీ నటి విజయశాంతి బంధువులకు చెందిన భూములని తెలియవచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దత్తత తీసుకున్న కొమరవోలులో ఈ ల్యాండ్ సీలింగ్ భూములలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ గ్రామ అభివృద్ధి కమిటీ కన్వీనర్ పొట్లూరి కృష్ణబాబు, జెడ్పీటీసీ పొట్లూరి శశి తెలిపారు.