కృష్ణ

దేశద్రోహులుగా బీజేపీ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 23: బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు, రాంమాధవ్ దేశద్రోహులు కన్నా అత్యంత ప్రమాదకరంగా మారారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో తెలుగు తల్లి పాలు తాగి ఆ తల్లి రొమ్మునే గుద్దేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ మాత్రం మానవత్వం లేని వీరు సుపరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. బీజేపీ నేతలను తెగువ కలిగిన తెలుగు జాతి ఏ మాత్రం ఉపేక్షించదన్నారు. రాత్రికి రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన కన్నా లక్ష్మీ నారాయణ జేబులో వైసీపీ జెండా, కారుకి బీజేపీ జెండా పెట్టుకుని రాష్ట్రంలో తిరుగుతున్నాడని విమర్శించారు. సహకార శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నూజివీడులో దేవాదాయ భూములను ఆక్రమించిన ఘనత కన్నా లక్ష్మీ నారాయణదన్నారు. అటువంటి కన్నా లక్ష్మీ నారాయణ అసంబద్ధ ప్రేలాపన సిగ్గు చేటన్నారు. కేవలం కేంద్రానికి తాబేదారులుగా వ్యవహరిస్తూ తెలుగు జాతిని మోసం చేస్తున్నారని విమర్శించారు. ఒక పక్క రాష్ట్రంలో సాగుతున్న సుపరిపాలనకు కేంద్రంలోని సంస్థలు రాష్ట్రానికి అవార్డులు ఇస్తుంటే వీరు మాత్రం కేంద్రం నుండి రివార్డులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజన సమయంలో పబ్బం గడుపుకునేందుకు తమతో జత కట్టిన బీజేపీ నేడు అవసరం తీరాక రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందన్నారు. తిత్లీ తుఫాన్‌తో సర్వం కోల్పోయిన ఉత్తరాంధ్రకు కేంద్రం చేసిన సాయం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు అధ్యయన కమిటీని కూడా కేంద్రం నియమించకపోవడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. కరువు జిల్లాలకు కేంద్రం నుండి నిధులు తీసుకురాలేని బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గు చేటన్నారు. తెలుగు జాతి సత్తా ఏమిటో 2019 ఎన్నికల్లో చూపిస్తామన్నారు. స్వార్ధపరులైన కన్నా, జీవీఎల్, రాంమాధవ్‌లను నమ్ముకున్న బీజేపీ రాష్ట్రంలో బంగాళాఖాతంలో కలవడం ఖాయమని ఎమ్మెల్సీ అర్జునుడు స్పష్టం చేశారు.

జనవరి జన్మభూమిలో అభివృద్ధి ప్రణాళికలు
జి కొండూరు, అక్టోబర్ 23: వచ్చే జనవరిలో జరిగే జన్మభూమి కార్యక్రమం ద్వారా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకుంటామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. మండలంలోని కట్టుబడిపాలెంలో మంగళవారం జరిగిన గ్రామదర్శిని, గ్రామవికాసం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. డిసెంబర్‌లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ద్వారా తాను స్వయంగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్లే పోలవరం ముంపు మండలాలు అంధ్రప్రదేశ్‌లో కలిపినట్లు తెలిపారు. అందువల్లే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ కల సాకారమైందన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పధకం వస్తే గోదావరి నీటితో ఈప్రాంతంలోని పంటలన్నీ సస్యశ్యామలం అవుతాయన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను ప్రతి ఒక్కరూ చూడాలని ఆయన సూచించారు. ఈప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి 28 సార్లు, తాను 78 సార్లు చూసి పర్యవేక్షణ చేశామన్నారు. పట్టిసీమ నీళ్ళతో 18వేల కోట్ల రూపాయల విలువైన పంటలను కాపాడామన్నారు. 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ప్రజల దీవెనలు పొందిన నాకు జలవనరుల శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి అవకాశం కల్పించి 57వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారన్నారు. ఇందుకు మైలవరం నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఒక అభ్యర్థి టిక్కెట్టును మరో అభ్యర్థి కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసి ప్రజాసేవకు వచ్చినట్లు నంగనాచి కబుర్లు చెబుతూ ప్రజలను మభ్యపెట్టి ప్రజాప్రతినిధి అవటానికి ఆరాట పడుతున్నాడని కేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. డబ్బుంటే గెలుపుగుర్రం ఇంటి ముంగిటకొస్తుందని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. మైలవరం ప్రజలు చైతన్యవంతులని ప్రగతికి తప్ప ఇతర ప్రలోభాలకు లొంగరని ఆయన స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ఉయ్యూరు నరశింహారావు, పార్టీ నేతలు బసవబోయిన నాగేశ్వరరావు, శివ తదితరులు పాల్గొన్నారు.