కృష్ణ

నేటి నుండి పోర్టు భూమి కొనుగోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 11: బందరు ఓడరేవు నిర్మాణానికి అవసరమైన భూముల కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. నేటి నుండి భూముల కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎకరం రూ.25 లక్షలకు భూములను కొనుగోలు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను మచిలీపట్నం అర్బన్ డెవల్‌ప్‌మెంట్ అధారిటీ (ముడ) అధికారులు సిద్ధం చేశారు. సోమవారం మంచి రోజు కావటంతో కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు. తొలి రోజు పోర్టు ప్రతిపాదిత గ్రామాల నుండి పది మంది రైతుల నుండి 10 ఎకరాల వరకు భూమిని కొనుగోలు చేసి వారి బ్యాంక్ ఎకౌంట్లకు జమ చేస్తారు. కొనుగోళ్ల ప్రక్రియ నిర్విఘ్నంగా సాగాలని కోరుతూ ఉదయం కోనేరుసెంటరులో సర్వమత ప్రార్థనలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ముడ కార్యాలయంలో కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు హాజరు కానున్నట్లు ముడ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ ఆంధ్రభూమి ప్రతినిధికి తెలియజేశారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన 5వేల 300 ఎకరాల్లో 3వేల 100 ప్రభుత్వ, అసైన్డ్ భూములు పోను 2వేల 200 ఎకరాలు పట్టా భూముల రైతుల నుండి సేకరించాల్సి ఉంది. ఇందులో 700 ఎకరాల భూమిని భూసమీకరణ కింద ఇచ్చేందుకు గతంలో రైతులు అంగీకార పత్రాలు అందచేశారు. 700 ఎకరాలు మినహాయించగా 1500 ఎకరాల పట్టా భూములను భూమి కొనుగోలు పథకం కింద కొనుగోలు చేయనున్నారు. భూమి కొనుగోళ్లు, వౌలిక సదుపాయాల కల్పనకు గాను రూ.1350 కోట్లు అవసరమవుతాయని ముడ అధికారులు అంచనాలు రూపొందించారు. భూముల కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించేందుకు గత వారం రోజుల క్రితం రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నుండి రూ.200కోట్లను ముడ అధికారులు రుణంగా పొందారు. ఈ పథకం కింద భూములు ఇచ్చే రైతులకు పన్ను మినహాయింపు ఇవ్వనున్నారు. పన్ను మినహాయింపు అంశానికి సంబంధించి ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన జీవో కూడా నేడు విడుదలయ్యే అవకాశం ఉంది.

నిర్ధిష్ఠమైన ప్రణాళికతో ముందుకు: వేదవ్యాస్
పోర్టు భూముల కొనుగోళ్లు, నిర్మాణ పనులను ప్రారంభించే విషయమై నిర్ధిష్ఠమైన ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడ) చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సహాయ సహకారాలతో ఓడరేవు నిర్మాణానికి అవసరమైన అన్ని ప్రతిబంధకాలను అధిగమించి కొనుగోళ్ల ప్రక్రియ వరకు వచ్చామన్నారు. పోర్టుకు అవసరమైన 1500 ఎకరాల పట్టా భూములను నెల రోజుల వ్యవధిలో కొనుగోళ్లు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్టు వేదవ్యాస్ తెలిపారు.

పోర్టు కట్టి తీరతాం: రవీంద్ర
పోర్టు నిర్మాణానికి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పోర్టు కట్టి తీరుతామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పోర్టును ఇతర ప్రాంతాలకు అమ్ముకున్న చరిత్ర ప్రతిపక్ష నేతలదన్నారు. పోర్టు నిర్మాణమే ఏకైక లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. రైతులకు గణనీయంగా లబ్ధి చేకూర్చేందుకు భూముల కొనుగోళ్ల ప్రక్రియ తెర మీద తీసుకు వచ్చి ఎకరానికి రూ.25లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఘనంగా కోదండరామ స్వామి దేవాలయంలో ధ్వజ ప్రతిష్ఠ
మైలవరం, నవంబర్ 11: మండలంలోని పొందుగల శివారు అనంతవరంలో వేంచేసియున్న శ్రీ కోదండ రామ స్వామిదేవస్థానంలో ఆదివారం జీవ ధ్వజ ప్రతిష్ఠ కార్యక్రమం అతి వైభవంగా కనుల పండువగా సాగింది. గత మూడు రోజులుగా దేవాలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం 11.45 గంటలకు అభయ ఆంజనేయ జీవధ్వజ యంత్ర బింబ, ప్రతిష్ట, కట్టాన్యాసం, దేను దృష్టి, కుంభాభిషేకం, మహామంగళ పురోషాతి అనంతరం శ్రీ కోదండరామ స్వాముల వార్ల దివ్యశాంతి కల్యాణ మహోత్సవం ఆలయ వేద పండితుల నడుల ఘనంగా నిర్వహించారు. భక్తులు వేలాదిగా పాల్గొని స్వామి వారికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇదిలా ఉండగా ఈకార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్, ద్వారకా తిరుమల దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు తనయుడు ఎస్వీఎన్ నివృత్‌రావు, గ్రామ పుర ప్రముఖులు బొందలపాటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.