కృష్ణ

‘అమ్మఒడి’కి కార్పొరేషన్ నిధుల మళ్లింపు గర్హనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: అమ్మఒడి పథకానికి వివిధ కార్పొరేషన్ల నిధులను ఏ విధంగా కేటాయిస్తారని శాసనమండలి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో అర్జునుడు మాట్లాడుతూ దళిత, గిరిజన, బలహీన, మైనార్టీ తదితర కార్పొరేషన్ నిధులను పక్కదారి పట్టించి అమ్మఒడి పథకానికి కేటాయించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం నిరుపేద, దళిత వర్గాల కోసం కార్పొరేషన్‌లకు నిధులు ఇచ్చి ఆ వర్గాలలోని నిరుపేదల కోసం ఆ కార్పొరేషన్‌ల ద్వారా వారి సంక్షేమ పథకాలు అమలు కాకుండా ఒక్క ప్రచార అర్భాటం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి మళ్లించడం సరైన విధానం కాదన్నారు. ముఖ్యంగా అమ్మఒడి పథకానికి దళిత, గిరిజన, బలహీన, మైనార్టీ వర్గాలకు సంబంధించిన నిధులు రూ.6120కోట్లు ఆ వర్గాల కార్పొరేషన్‌ల నుండి నిధులు తీసి వేసి ఆ వర్గాల ప్రజలకు అన్యాయం చేయడం గర్హనీయమన్నారు. పేద వర్గాల నిధులను పక్కదారి పట్టించిన ప్రభుత్వం బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేస్తోందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పివి ఫణికుమార్, బోలెం అయోధ్య రామయ్య, బృందావనం శ్యామ్ కుమార్, రఘు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

పోలీసు క్రీడల్లో విజేతలకు బహుమతి ప్రదానం
జి.కొండూరు, జనవరి 13: మండల కేంద్రమైన జి.కొండూరులో పోలీసు వారి ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుంచి నిర్వహిస్తున్న క్రీడాపోటీలు సోమవారం నాటితో ముగిశాయి. జి.కొండూరు జెడ్పీ హైస్కూల్లో వాలీబాల్, కబడ్డీ ఫైనల్ పోటీలు నిర్వహించారు. ముగింపు అనంతరం విజేతలకు ఎస్‌ఐ పి.రాంబాబు, మాజీ ఎంపిపి వేములకొండ తిరుపతిరావులు పాల్గొని బహుమతులు అందచేశారు. వాలీబాల్ పోటీల్లో విజేతలు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన జట్టులు వరుసగా వెల్లటూరు, జి.కొండూరు, కందులపాడులు గెలుపొందాయి. కబడ్డీలో కూడా వరుసగా జి.కొండూరు, కట్టుబడిపాలెం, వెంకటాపురం టీములు గెలుపొందాయి. విజేతలకు నగదు బహుమతులు రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలను అందచేశారు.
ప్రజా సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
మచిలీపట్నం (కోనేరుసెంటరు), జనవరి 13: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ఎఎండీ ఇంతియాజ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా నుండి తరలి వచ్చిన ప్రజల నుండి విజ్ఞాపన పత్రాలను కలెక్టర్ ఇంతియాజ్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందన పెండింగ్ అర్జీల పరిష్కారంతో పాటు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. జిల్లాలోని పలు మండలాల్లో ఎక్కువగా దరఖాస్తులు ఇళ్ల స్థలాల విషయమై, భూ సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు తదితర అంశాలే అత్యధికంగా ఉన్నందున రెవెన్యూ అధికారులు ఆయా మండలాల్లోనే ప్రజల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత, జేసీ-2 మోహన్ కుమార్, ఆర్డీఓ ఖాజావలి, డీఆర్‌డీఎ పీడీ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
‘మనబడి నాడు-నేడు’ ప్రారంభం
కూచిపూడి, జనవరి 13: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి చేపట్టిన మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని సోమవారం మొవ్వ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించారు. మండలంలోని 16 సచివాలయాల పరిధిలోని 21 పాఠశాలలను నాడు-నేడు పథకానికి ఎంపిక చేసి నిధులు మంజూరు చేసినట్లు ఇఓపీఆర్‌డీ ఎస్ శ్రీనివాసరెడ్డి, ఉపాధి హామీ ఏపీఓ కె లక్ష్మీరెడ్డి తెలిపారు. పెదపూడి ఎంపీయుపీ పాఠశాలలో రూ.13లక్షల 48వేలతో మంచినీరు, టాయిలెట్లు, రంగులు, పర్నీచర్, ఇంగ్లీష్ ల్యాబ్, ఫ్యాన్‌లు, లైట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం మంజూరు చేసిందని హెచ్‌ఎం వి ఉషారాణి తెలిపారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే యద్దనపూడి గ్రామంలో రూ.8.4లక్షలు కేటాయించినట్లు ఎస్‌ఎస్‌ఆర్ ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్, ఉప చైర్మన్‌లు మద్దాల వెంకటేశ్వరరావు, కుప్పాల సుమ, సీఆర్‌పీ సి సమర్పణరావు, ఇంజనీర్ వి ఆల్‌ఫ్రెడ్, ఎస్‌ఎస్‌ఆర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.