కృష్ణ

తెలుగు నేల ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన ఒంగోలు జాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ: తెలుగు నేల ఖ్యాతిని ఒంగోలు జాతి పశువులు ఖండాంతరాలకు చేర్చాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. సోమవారం స్థానిక లింగవరం రోడ్డులోని కే కనె్వన్షన్‌లో ఎన్టీఆర్ టూ వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు 3వ రోజు పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ గత వైభవానికి ఒంగోలు జాతి గిత్తలు వారధిగా నిలుస్తున్నాయన్నారు. ఒంగోలు జాతి గిత్తల సొగసు చూసేందుకు రెండడు కళ్ళూ చాలవన్నారు. ఎడ్లను మేపడం, పందాలకు వాటిని తరలించడం రైతుకు గర్వకారణంగా ఉండేదన్నారు. ఎడ్ల గెలుపును తమ గెలుపుగా భావించే వాటి యజమానులు గర్వంతో ఉప్పొంగి పోతారన్నారు. రవాణా సౌకర్యం లేని సమయంలో రైతులను, వ్యవసాయ ఉత్పత్తులను ఇవి సుదూర ప్రాంతాలకు తీసుకెళ్ళగలిగేవన్నారు. నేడు ఇవి కనుమరుగయ్యే పరిస్థితి ఎదుర్కొంటున్నాయని, వీటి ఉనికిని కాపాడలేని నిస్సహాయ స్థితిలో రైతులు ఉన్నారన్నారు. ఒంగోలు జాతి పశు సంపద, రైతుల దుస్థితిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానని కొడాలి నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త కొడాలి నాగేశ్వరరావు(చిన్ని), వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, నాయకులు కొల్లి విజయ్, పాలడుగు రాంప్రసాద్, ఎంవీ నారాయణరెడ్డి, పొట్లూరి కృష్ణారావు, పాలేటి చంటి, అడపా బాబ్జి, గొర్ల శ్రీను, వల్లూరుపల్లి సుధాకర్, కొంకితల ఆంజనేయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.