కృష్ణ

యోగా సాధనతో పరిపూర్ణ ఆరోగ్యం: ఎమ్మెల్యే వసంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు: అందరూ నిత్యం యోగాసాధన చేసి పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆకాంక్షించారు. మండల కేంద్రమైన జి.కొండూరులో ఎల్‌ఎమ్‌ఆర్ హాస్పటల్ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం భవానీపురంశాఖ శ్రీ కళాధర యోగి మునగంటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన 810వ ఉచిత యోగా శిక్షణా శిబిరం ఆదివారం ఘనంగా ముగిసింది. ఈముగింపు కార్యక్రమానికి శ్రీ ఆతుకూరి వెంకటేశ్వర యోగి గురూజీ, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, కెడిసిసిబి డైరెక్టర్ వేములకొండ రాంబాబు, కాజ బ్రహ్మయ్య, వేములకొండ తిరుపతిరావు, ఎస్‌ఐ పి.రాంబాబు తదితర ప్రముఖులు హాజరై అందరికీ అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా వెంకటేశ్వర యోగి గురూజీ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఎంత డబ్బు, పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఆరోగ్యం బాగోకపోతే దేన్నీ అనుభవించలేమన్నారు. ఉన్నదాంట్లోనే సంతృప్తిగా జీవించాలని, అసూయ, ద్వేషాలను విడనాడాలని సోదాహరణంగా వివరించారు. నిత్యం యోగా సాధనతో నిత్యం ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఆహారం తీసుకున్నంత కాలం యోగా చేయాలన్నారు. ముందుగా దీపారాధన చేసి ముగింపు సత్సంగాన్ని ప్రారంభించారు. చలిలో భవానీపురం నుంచి తెల్లవారుజామున 25 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేసి వస్తూ ఎటుంవంటి స్వార్థం లేకుండా శిక్షణనిచ్చిన మునగంటి నాగేశ్వరరావు దంపతులకు యోగసాధకులు పుష్పానిషేకం చేశారు. జి.కొండూరులో బత్తిన శ్రీనివాసరావు, పజ్జూరు శ్రీనివాసరావు, చనమోలు అనిల్‌కుమార్ తదితరులు ప్రజలను చైతన్యవంతులను చేసి యోగాను పరిచయం చేశారు. నిత్యం యోగా చేస్తేనే గురువులకు ఎంతో ఆనందం ఉంటుందన్నారు. అనంతరం పలువురికి జ్ఞాపికలను సమర్పించారు. యోగసాధనకు స్థలసౌకర్యం కల్పించిన శాగం జమిలిరెడ్డిని ఘనంగా సత్కరించారు. యోగా నిత్యసాధనలో మాజీ ఎఎంసి చైర్మన్ వుయ్యూరు నరసింహారావు, చంద్రశేఖర్, బట్టపర్తి రాజు, పజ్జూరు నాగరాజు, షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు.