కృష్ణ

మూడవ రోజు కొనసాగిన ‘కాగిత’ గృహ నిర్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంటుమిల్లి: రాజధాని తరలింపు విషయంలో పెడన నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్, నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్‌ల గృహ నిర్బంధం మూడవ రోజైన మంగళవారం కూడా కొనసాగింది. బంటుమిల్లి ఎస్‌ఐ ఎం తులసీరామకృష్ణ నేతృత్వంలో కాగితకు నోటీసు ఇచ్చారు. అమరావతి తరలింపు, అసెంబ్లీ ముట్టడి తదితర ఘటనల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇటువంటి చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. కాగా గృహ నిర్బంధంతో ఉద్యమాలను ఆపలేరని, వైసీపీ అరాచక పాలన చేస్తోందని కాగిత విమర్శించారు. ఈ కార్యక్రమంలో బొల్లా వెంకన్న, కూనపరెడ్డి వీరబాబు, కాశీ, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

శారీరక మార్పులకు అనుగుణంగా బాలికలు ఎదగాలి
మైలవరం, జనవరి 21: శారీరక మార్పులకు అనుగుణంగా బాలికలు ఎదగాలని ఐసిడిఎస్ మైలవరం సీడీపీఓ కెవిఎస్ రత్నకుమారి అన్నారు. మైలవరానికి చెందిన మదర్ ధెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కిశోర వికాసం ఫేజ్-3 పథకం కింద స్థానిక ఎస్వీఆర్జీఎన్నార్ డిగ్రీ కళాశాలకు చెందిన సుమారు 100 మంది బాలికలకు శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటైన సభలో సీడీపీఓ మాట్లాడుతూ యుక్తవయసు గల పిల్లలలో జన్యుపరమైన మార్పులు వస్తాయని వాటిని గమనిస్తూ వాటికి అనుగుణమైన ఆహారాన్ని తీసుకోవటంతోపాటు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. మదర్ ధెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోయ సుధ, ఎస్‌ఐ కె ఈశ్వరరావు, మహిళా సంరక్షణ కార్యదర్శి ఏ మాధవీలత మాట్లాడుతూ బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులు ఇటీవల కాలంలో పెచ్చుమీరాయని ఆందోళన వ్యక్తం చేశారు. దిశ చట్టం సక్రమంగా అమలు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బి శ్రీనివాసరావు, ఏఓ కృష్ణకిషోర్, ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు టికేవి లక్ష్మీకాంతం, ఐ అన్నమ్మ, ఎన్ రాజేశ్వరి, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఝాన్సీ, హైమావతి, రమాదేవి, పంచాక్షరి, విద్యార్థినిలు పాల్గొన్నారు.