కృష్ణ

తీరప్రాంత భద్రత మరింత కట్టుదిట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: సముద్ర తీర భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు మెరైన్ పోలీసులను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో తీర ప్రాంత భద్రతపై మెరైన్ పోలీసులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ జిల్లాలో 127 కిలో మీటర్ల సముద్ర తీరం ఉందన్నారు. ఈ తీర ప్రాంతాన్ని సంరక్షించేందుకు గిలకలదిండి, పాలకాయతిప్ప, ఒర్లగొందితిప్ప మెరైన్ పోలీసు స్టేషన్లు ఉన్నాయన్నారు. మెరైన్ పోలీసులు సముద్ర తీర ప్రాంత గ్రామ ప్రజలకు నిత్యం శాంతిభద్రతలపై అవగాహన కల్పించాలన్నారు. అవగాహనా సదస్సులు నిర్వహించి తీరప్రాంతం గుండా ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా తక్షణమే సమాచారం వచ్చేలా చూడాలన్నారు. సమాచార సేకరణకు వారంలో ఒకసారి విలేజ్ విజిలెన్స్ కమిటీలు, విలేజ్ కమిటీలతో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. సుదూర ప్రాంతాలకు చెందిన బోట్లు ఏవైనా సంచరించినచో జిల్లా తీర ప్రాంతంలో వేటను కొనసాగించినచో వారిని అక్కడి నుండి వారి ప్రాంతాలకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు మత్స్యకార ప్రజల సంరక్షణ చూసుకుంటూ, ప్రభుత్వం కల్పించే రాయితీలు, బీమా పథకాలు వంటి వాటిని తెలియజేయాలన్నారు. సముద్ర మార్గం గుండా చొరబాటుదారులు రాకుండా, మెరైన్ బోట్లు గస్తీ తిరిగేలా చూడాలన్నారు. గస్తీకి వినియోగించే సాధనాలు, పరికరాలు వినియోగంలోకి తీసుకురావాలన్నారు. కొరత ఉన్న సామాగ్రి గురించి తమ దృష్టికి తీసుకు వస్తే వాటిని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేటకు వెళ్లే మత్స్యకారుల పూర్తి సమాచారం మెరైన్ సిబ్బంది వద్ద ఉండాలన్నారు. దీనివల్ల కొత్త వ్యక్తులు ఎవరైనా తారసపడితే వారిని గుర్తించి ఎదుర్కొవడం సులభతరమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు, ట్రైనీ ఐపీఎస్ కృష్ణకాంత్ పటేల్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర, స్పెషల్ బ్రాంచ్ సీఐ చంద్రశేఖర్, బందరు తాలుకా సీఐ కొండయ్య, చిలకలపూడి సీఐ వెంకట నారాయణ, అవనిగడ్డ సీఐ రవికుమార్, గిలకలదిండి, ఒర్లగొందితిప్ప, పాలకాయతిప్ప మెరైన్ స్టేషన్ సీఐలు సతీష్ కుమార్, గౌరీశంకర్, పవన్ విషోర్ తదితరులు పాల్గొన్నారు.