కృష్ణ

ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్): ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య, పౌష్టికాహారంతో కూడిన భోజన పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్ అన్నారు. మంగళవారం స్థానిక పాత రామన్నపేటలోని పాండ్రాక పున్నమ్మ సాహెబ్ పురపాలక సంఘం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నూతన మెనూను డీఆర్‌ఓ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను నేర్పుతూ వారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేయాలన్నారు. అందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. ముడా వైస్ చైర్మన్ విల్సన్‌బాబు మాట్లాడుడూ ప్రభుత్వ పాఠశాలలు గతంలో కంటే మెరుగైన రీతిలో పని చేస్తున్నాయన్నారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా విద్యాశాఖ సూపరింటెండెంట్ పి వెంకటేశ్వరరావు వాటర్ బాటిల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ బి శివరామకృష్ణ, ఏడీ సత్యనారాయణమూర్తి, ప్రభుత్వ పరీక్షల సహాయ కమీషనర్ పవన్ కుమార్, ఎ నాగరాజు, హెచ్‌ఎం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.